English | Telugu

త్రిష పెళ్లి కబుర్లు

దాదాపు ఒక దశాబ్దం పాటు తెలుగు, తమిళ సినీ రంగాలను ఏలిన హీరోయిన్ త్రిష తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్ న్నిపెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడబోతోంది. ఈనెల 23న చెన్నైలో ఒక స్టార్ హోటల్లో వారి నిశ్చితార్ధ వేడుక జరుగబోతోంది. ఆరోజున ఆమెకు కాబోయే వరుడు వరుణ్ రూ. 7 కోట్లు విలువచేసే నల్లటి రంగు గల ‘రోల్స్‌ రాయిస్’ కారుని బహుమానంగా ఇవ్వబోతున్నట్లు చెన్నై మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకు కేవలం ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. కానీ జనవరి 24న దక్షిణాదిన చిత్ర పరిశ్రమలో ప్రముఖులందరినీ పిలిచి భారీగా విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఎవరయినా పెళ్లి రోజున లేదా ఆ తరువాత అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. కానీ త్రిష వెరైటీగా పెళ్ళికి ముందే విందు భోజనం తినిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వారి వివాహం గురించి మరొక ఆసక్తికరమయిన వార్త కూడా వినిపిస్తోంది. వారిరువురూ తమ వివాహ వేడుకని ఎగిరే విమానంలో జరుపుకోవాలనుకొంటున్నట్లు సమాచారం. అదే నిజమయితే త్రిష పెళ్ళి వేడుక కూడా చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. కానీ విమానంలో పెళ్లి జరుపుకొనేమాటయితే ముఖ్యమయిన అతికొద్ది మంది మాత్రమే దానికి హాజరు కాగలుగుతారు. మిగిలినవారందరూ ఇంట్లో కూర్చొని వీడియోలో చూస్తూ చప్పట్లు కొట్టి సంతృప్తి పడవలసి వస్తుందేమో?