English | Telugu
అది రీమేక్ చేసి ప్రభుదేవా రిస్క్ చేస్తున్నాడే
Updated : Jan 16, 2015
కృష్ణ వంశీ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే' చాలా భారీ అంచనాలతో విడుదలయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడి మెగాభిమానులందరినీ తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి కూడా కనీసం వసూలు చేయలేక చతికిలపడటంతో నిర్మాత బండ్ల గణేష్ కు రామ్ చరణ్ కొంత డబ్బు వాపసు చేసినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చేయి. అటువంటి సినిమాను ప్రభుదేవా హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. తెలుగులోనే చతికిలపడిన సినిమాని హిందీలో రిమేక్ చేయడం, దానిని విజయవంతం చేయడం రెండూ చాలా కష్టమయిన పనులే. మరి ప్రభుదేవాకు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకో? ఏమో?