English | Telugu
బజ్ః ఒకే బాటలో బాలయ్య, మహేశ్, చరణ్, రవితేజ!?
Updated : May 30, 2022
నటసింహం నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ మహారాజా రవితేజ.. ఇలా ఈ టాప్ స్టార్స్ అంతా రాబోయే చిత్రాల కోసం ఒకే బాటలో పయనించనున్నారా!? అవునన్నదే టాలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. గత చిత్రం `అఖండ` కోసం ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న గోపీచంద్ మలినేని సినిమాలోనూ రెండు విభిన్న పాత్రల్లో నటించబోతున్నారని సమాచారం. దసరా సీజన్ లో ఈ యాక్షన్ డ్రామా ఎంటర్టైన్ చేయనుంది. ఇక బాలయ్య లాగే రామ్ చరణ్ కూడా శంకర్ డైరెక్టోరియల్ కోసం డబుల్ ధమాకా ఇవ్వనున్నారట. ఇందులో తండ్రీకొడుకులుగా చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు బజ్. 2023లో చరణ్ - శంకర్ కాంబో మూవీ రిలీజ్ కానుంది. అలాగే ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న `ధమాకా` కోసం రవితేజ కూడా ఇదే శైలిలో సందడి చేయనున్నారట. ఈ క్యాలెండర్ ఇయర్ లోనే `ధమాకా` తెరపైకి రానుంది. మరోవైపు.. మహేశ్ బాబు కూడా త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ కోసం డ్యూయెల్ రోల్స్ లో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారని చెప్పుకుంటున్నారు. 2023లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది. మరి.. ఇప్పటికే వెండితెరపై ద్విపాత్రాభినయంతో మెప్పించిన బాలయ్య, మహేశ్, చరణ్, రవితేజ.. మరోసారి మెస్మరైజ్ చేస్తారేమో చూడాలి. కాగా, త్వరలోనే ఆయా చిత్రాల్లో బాలయ్య, మహేశ్, చరణ్, రవితేజ డ్యూయెల్ రోల్స్ పై క్లారిటీ రానున్నది.