English | Telugu
`సీతా రామం`కి హను నెగటివ్ సెంటిమెంట్!
Updated : May 30, 2022
`అందాల రాక్షసి` (2012)తో దర్శకుడిగా పరిచయమైన హను రాఘవపూడి.. ఆపై వచ్చిన `కృష్ణగాడి వీరప్రేమగాథ` (2016)తో తొలి విజయాన్ని చవిచూశాడు. అటుపై `లై` (2017), `పడి పడి లేచె మనసు` (2018)తో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ పొందిన హను.. స్వల్ప విరామం అనంతరం `సీతా రామం` కోసం మరోమారు మెగాఫోన్ పట్టాడు. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ పిరియడ్ డ్రామాలో రష్మికా మందన్న ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనుంది. ఆగస్టు 5న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తెరపైకి రాబోతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. హనుకి `సీతా రామం` ఆగస్టు నెల పరంగా మూడో రిలీజ్. తన ఫస్ట్ ఫిల్మ్ `అందాల రాక్షసి` 2012 ఆగస్టు 10న విడుదలై ఆశించిన విజయం సాధించకపోగా.. మూడో చిత్రమైన `లై` కూడా ఐదేళ్ళ తరువాత అంటే 2017లో ఇదే నెలలో (ఆగస్టు 11) రిలీజై డిజాస్టర్ గా నిలిచింది. కట్ చేస్తే.. మళ్ళీ ఐదేళ్ళ అనంతరం 2022లో `సీతా రామం` కూడా ఆగస్టులోనే విడుదలకు సిద్ధమైంది. మరి.. హను రాఘవపూడి ఆగస్టు నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి.. `సీతా రామం` విజయపథంలో పయనిస్తుందో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.