English | Telugu

అనుపమ లవ్ స్టోరీలో బిగ్ ట్విస్ట్.. అతని మనసులో ఏముందో?

మలయాళ సూపర్ హిట్ మూవీ 'ప్రేమమ్'తో వెండితెరకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్.. 'అఆ', 'ప్రేమమ్'(తెలుగు), 'శతమానం భవతి', 'ఉన్నది ఒకటే జిందగీ' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తున్న అనుపమ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సినిమాలలో వన్ సైడ్ లవ్ స్టోరీలు చూస్తుంటాం. అనుపమది కూడా అలాంటి లవ్ స్టోరీనేనట. తాను ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాని.. కానీ అవతలి వ్యక్తి మనసులో ఏముందో తనకి తెలియదని.. ప్రస్తుతానికి తనది వన్ సైడ్ లవ్ అని అనుపమ చెప్పింది. తనకు ప్రేమ వివాహంపై మంచి అభిప్రాయం ఉందని, ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలను చూస్తే చాలా ముచ్చటేస్తుందని తెలిపింది. తనకు కూడా లవ్‌ మ్యారేజ్‌ చేసుకోవాలని ఉందని, ఈ విషయం తన కుటుంబ సభ్యులకు కూడా తెలుసని అనుపమ చెప్పుకొచ్చింది.

కాగా భారత క్రికెటర్ బుమ్రాతో అనుపమ ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. గతేడాది బుమ్రాకి సంజనతో వివాహమైన సమయంలో అనుపమ చాలా బాధపడినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా అనుపమ కామెంట్స్ ని బట్టి చూస్తే ఆమె లవ్ చేస్తున్నది బుమ్రాని కాదని తెలుస్తోంది.

ప్రస్తుతం అనుపమ '18 పేజెస్, 'కార్తికేయ-2', 'బటర్ ఫ్లై' చిత్రాల్లో నటిస్తోంది. '18 పేజెస్, 'కార్తికేయ-2' సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ నిఖిలే హీరో కావడం విశేషం. ఇక 'బటర్ ఫ్లై' విషయానికొస్తే ఇది ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ.