English | Telugu
ఫారిన్ వెళ్తున్న విజయ్... భార్య కోసమేనా?
Updated : Jan 9, 2023
ఇళయ దళపతి విజయ్ ఫారిన్ ట్రిప్ కన్‌ఫర్మ్ అయింది. ఈ నెల 11న ఆయన నటించిన వారిసు రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ టైమ్‌లో ఫారిన్ ట్రిప్ ఎందుకు? అని అనుకుంటున్నారా? అక్కడే ఆయన భార్య సంగీత, పిల్లలు ఉన్నారు. గత కొన్నాళ్లుగా ఫారిన్ టూర్‌లో ఉన్నారు విజయ్ భార్యా పిల్లలు. ఈ న్యూయర్‌కి వాళ్లతో కలిసి స్పెండ్ చేయాలనుకున్నారు విజయ్. అంతలోనే వారిసు ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేశారు. మరోవైపు విజయ్ 67 పనులు స్టార్ట్ అయ్యారు. లోకేష్ కనగరాజ్ డైరక్షన్‌లో తన 67వ సినిమా చేస్తున్నారు విజయ్. అందుకే ట్రిప్‌లో కాస్త ఆలస్యం జరిగింది.
ఇంతలోనే విజయ్, తన భార్య సంగీత నుంచి విడిపోతున్నారని వార్తలొచ్చాయి. 22 ఏళ్ల వైవాహిక జీవితం వారిది. ఒకరిపట్ల మరొకరికి ప్రేమ, బాధ్యత ఉన్నాయి. వారిద్దరూ విడిపోవడం జరగదు. వారిసు సినిమా ఆడియో వేడుకకు సంగీత రాకపోవడంతో ఇలాంటి పుకార్లు మొదలయ్యాయి. వాటికి తోడు అట్లీ భార్య ప్రియ సీమంతానికి కూడా సంగీత రాలేదు. విజయ్ కూడా కాస్త డల్‌గా కనిపించడంతో ఈ రూమర్స్ స్టార్ట్ అయ్యాయని అంటున్నారు సన్నిహితులు.
విజయ్, సంగీతలకు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమని చెబుతున్నారు ఆయన కుటుంబసభ్యులు. విజయ్ ఫారిన్ ట్రిప్ కూడా భార్యాపిల్లలతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడానికేనని, త్వరలోనే వాళ్లతో తిరిగి వచ్చేస్తారని అంటున్నారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో వారిసు సినిమాలో నటించారు విజయ్. రష్మిక మందన్న నాయిక. దిల్‌రాజు నిర్మించారు. ఈ నెల 11న తెలుగు, తమిళంలో విడుదల కానుంది వారిసు.