English | Telugu

అఫీషియల్.. 'వారసుడు' విడుదల వాయిదా

అఫీషియల్.. 'వారసుడు' విడుదల వాయిదా

ఊహించిందే జరిగింది. దిల్ రాజు నిర్మించిన 'వారిసు'(వారసుడు) తెలుగు విడుదల వాయిదా పడింది. తమిళ్ లో జనవరి 11న విడుదలవుతున్న ఈ చిత్రం తెలుగులో మాత్రం జనవరి 14కి వాయిదా పడింది. ఈ విషయాన్ని తాజాగా దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు.

ఈ సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి. జనవరి 12న బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి', జనవరి 13న చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఈ సినిమాలకు సరిపడా థియేటర్లు దక్కనివ్వకుండా.. దిల్ రాజు తాను నిర్మించిన తమిళ్ సినిమాని భారీ స్థాయిలో తెలుగునాట విడుదల చేస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. చిరు, బాలయ్య సినిమాల ఓపెనింగ్స్ పై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ఫ్యాన్స్ మండిపడ్డారు. అంతేకాదు వారసుడు సినిమాని బాయ్ కాట్ చేద్దామంటూ మెగా, నందమూరి అభిమానులతో పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారుసుడు సినిమాని తెలుగులో మూడు రోజులు ఆలస్యంగా విడుదల చేయాలని దిల్ రాజు నిర్ణయం తీసుకున్నాడు.

తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన దిల్ రాజు.. ప్రేక్షకులు థియేటర్లలో ముందుగా మన తెలుగు స్టార్ హీరోలు నటించిన 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' చూడాలన్న ఉద్దేశంతో 'వారసుడు'ని జనవరి 14న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు.

అఫీషియల్.. 'వారసుడు' విడుదల వాయిదా