English | Telugu

పవన్ తీన్ మార్ నైజాం ఎవరిదంటే

ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "తీన్ మార్" మూవీ యొక్క నైజాం ఏరియా పంపిణీ హక్కులు ఎవరికి దక్కాయంటే మల్టీ డైమెన్షన్ కంపెనీకి దక్కాయని వినికిడి. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, అందాల తార త్రిష హీరోయిన్ గా, జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం "తీన్ మార్". ఈ "తీన్ మార్" చిత్రం యొక్క నైజాం ఏరియా హక్కులను మల్టీ డైమెన్షన్ కంపెనీ సొంతం చేసుకుందట. ఈ "తీన్ మార్" చిత్రాన్ని అలాంటి పెద్ద కంపెనీ అయితే నైజాం ఏరియాలో మంచి థియేటర్లలో విడుదల చేయగలదని సమాచారం.

ఒక సినిమాని ఎంత బాగా తీసినా ఆ సినిమాని సరైన థియేటర్లలో రిలీజ్ చేయలేకపోతే దాని ఫ్లేవర్ పాడైపోతుంది. చాలా సినిమాలకు గతంలో ఈ అనుభవం ఎదురయ్యింది. ఈ "తీన్ మార్" చిత్రానికి ఆ పరిస్థితి రాకూడదనే మల్టీ డైమెన్షన్ కంపెనీకి ఈ నైజాం ఏరియా పంపిణీ హక్కులను అందించారని తెలిసింది. ఈ "తీన్ మార్" చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం విశేష ప్రేక్షకాదరణతో ఘనవిజయం సాధించింది. ఈ "తీన్ మార్" చిత్రాన్ని ఏప్రెల్ 14 వ తేదీన విడుదల చేస్తారని వినిపిస్తున్నా, అది బహుశా సాధ్యపడకపోవచ్చు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.