English | Telugu

పవన్ కళ్యాణ్ తీన్ మార్ శాటిలైట్ 7 కోట్లు

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రం యొక్క శాటిలైట్ హక్కులు 7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయని సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష, కృతి కర్బందా హీరోయిన్లుగా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్నచిత్రం "తీన్ మార్". బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన "లవ్ ఆజ్ కల్" చిత్రానికిది రీమేక్. అయితే ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కుల కోసం చాలా శాటిలైట్ ఛానల్స్ పోటీపడ్డాయి.

ఎన్ని ఛానల్స్ పోటీపడినా ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రం యొక్క శాటిలైట్ హక్కులు 7 కోట్ల రూపాయలకు "మా" టివి సొంతం చేసుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇంతవరకూ అమ్ముడైన సినిమాల శాటిలైట్ రేట్లలో పవన్ కళ్యాణ్ "తీన్ మార్" శాటిలైట్ రేటే అత్యధికమని సమాచారం. మణి శర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల ఘనంగా విడుదలైంది. ఈ ఆడియోకి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.