English | Telugu
సంక్రాంతి బరిలో సాయిధరంతేజ రేయ్
Updated : Nov 11, 2013
సాయిధరంతేజ హీరోగా అప్పట్లో 2010లో ప్రారంభమైన "రేయ్" సినిమా ఎట్టకేలకు 2014 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వై.వి.యస్. చౌదరి దర్శకత్వంలో మూడు సంవత్సరాల పాటు కష్టపడి తెరకెక్కించిన ఈ చిత్రం సాయిధరంతేజకు మొదటి సినిమా అవుతుందో లేక రెండో సినిమా అవుతుందో చూడాలి. ఎందుకంటే సాయిధరంతేజ హీరోగా ఇటీవలే "పిల్లా నువ్వులేని జీవితం" అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం కూడా దాదాపు సగం షూటింగ్ పూర్తయినట్లుగా తెలిసింది. ఈ చిత్రాన్ని కూడా త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అసలే దర్శక, నిర్మాత భాద్యతలు రెండు తీసుకున్న వై.వి.యస్. చౌదరి ఈ చిత్రంపైనే చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో సాయిధరంతేజ సరసన సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్ర ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.