English | Telugu

మంచు వారి పాండవులు తుమ్మెదా

మంచు కుటుంబం మొత్తం కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రానికి "పాండవులు పాండవులు తుమ్మెదా" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మనోజ్, విష్ణు, వరుణ్ సందేశ్, తనీష్ లు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రవీనా టాండన్, ప్రణీత, హన్సిక కథానాయికలుగా నటిస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లలో మంచు విష్ణు, మనోజ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.