English | Telugu

సెక్స్ కళాత్మకమైనది..రక్తాన్ని చెమటగా మార్చాలి 

సుశాంత్(sushanth)హీరోగా వచ్చిన చిలసౌ తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన భామ రుహాని శర్మ(ruhani sharma)ఆ తర్వాత హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు తో పాటు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన వెంకటేష్(venkatesh)సైంధవ్, వరుణ్ తేజ్ (varun tej)ఆపరేషన్ వాలంటైన్ లోను ముఖ్య పాత్రల్లో చేసింది. అదే సంవత్సరం హిందీలో ఆగ్రా(agra) అనే మూవీ చేసింది. ఇప్పుడు ఈ మూవీ విషయంలోనే కొన్ని సంచలనాత్మక వివరణలు ఇచ్చింది.

2023 మే 24 న ఆగ్రా విడుదలై మంచి ప్రేక్షాదరణ పొందటంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇందులో రుహాని కొన్ని బోల్డ్ సీన్స్ లో చేసింది.ఇప్పుడు ఆ సీన్స్ ని రుహాని ప్రైవేట్ వీడియోస్ అంటూ కొంత మంది సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో వైరల్ గా మారాయి. దీంతో తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ రుహాని ఒక లేఖ విడుదల చేసింది. ఆగ్రా లో బోల్డ్ సన్నివేశాలు సోషల్ మీడియాలో వస్తున్నప్పట్నుంచి ఎంతో నిరుత్సాహంగా ఉన్నాను. ఒక రకంగా నిరుత్సాహం అనేది చిన్న మాట. మా కష్టాన్ని అకింత భావాన్ని విస్మరించి కేవలం కొన్ని సన్నివేశాలని మాత్రం వైరల్ చేయడం హృదయ విధాకారంగా కూడా ఉంది. కళాత్మక చిత్రాలని రూపొందించడం అనేది పెద్ద సవాలు. వాటి కోసం నిద్రలేని రాత్రులు గడపటంతో పాటు రక్తాన్ని చెమటగా మార్చాలి. కన్నీళ్ళని అర్ధం చేసుకోకుండా కొందరు దాని గురించి తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పింది.

అదే విధంగా అసలు కొన్ని సన్నివేశాల ఆధారంగా సినిమాపై ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు.అది సరైన పద్ధతి కాదు పైగా అలాంటి వాళ్ళందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కళ ఎప్పుడు సౌలభ్యంగా సులభంగా ఉండదు.ఎన్నో బావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి కళాకారుల శ్రమని వృధా చెయ్యకండి. సినిమా గొప్పతనం తెలుసుకోండంటూ వివరణ ఇచ్చింది.