English | Telugu

రౌడీ ఫెలో ఫస్ట్ లుక్

బాణం హీరో నారా రోహిత్ నటిస్తున్న చిత్రం రౌడీ ఫెలో ఫస్ట్‌లుక్ విడుదల అయింది. ఈ చిత్రానికి దర్శకత్వం కృష్ణచైతన్య వహిస్తున్నారు. ఇది దర్శకుడిగా ఆయనకు తొలిచిత్రం. గతంలో ఆయన లిరిసిస్ట్‌గా 150కి పైగా పాటలు రాశారు.బాణం, సోలో, ప్రతినిధి వంటి విభిన్న తరహా చిత్రాలను ఎంచుకునే నారా రోహిత్ ఈ చిత్రంలో డిఫరెంట్‌గా కనిపించనున్నారని ఫస్ట్‌లుక్ చూడగానే తెలిసిపోతోంది. గుండే లాజిక్ లేకుండా కొట్టుకుంటుంది అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో విడుదల చేసిన ఫస్ఠ్‌లుక్ టీజర్, రౌడీఫెలో అనే టైటిల్ డెఫినెట్‌గా ఆడియెన్స్‌కి మంచి ఇంప్రెషన్ ఇచ్చాయనిపిస్తోంది. ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం విశేషాల కోసం చూస్తూనే వుండండి తెలుగువన్.