English | Telugu
చిరు ఎంట్రీ - అల్లూ అరవింద్ నో ఎంట్రీ
Updated : May 27, 2014
అవును ఇది నిజమే...మెగా ఫ్యామిలీలోనే ఈ తంతు జరుగుతోంది. అయితే ఇది ఏ విషయంలో అని తెలియాలంటే చదవండి..
అల్లు అరవింద్ చిన్న కుమారుడూ అల్లు శిరీష్ గౌరవం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ మెగాహీరో తాజాగా మారుతి దర్శకత్వం వహించిన 'కొత్తజంట' చిత్రంలో నటించాడు. ఈ చిత్రం సక్సెస్ అంతంత మాత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమా పెద్ద హిట్ సాధించకపోయినా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో మరో సినిమా చేయడానికి మారుతికి ఆఫర్ మాత్రం దక్కింది. శిరీష్‌కి తొలివిజయం అందించినందుకు, అలాగే ఖర్చులు పోను, కొంచెం లాభం కూడా తెచ్చిపెట్టినందుకు సంతోషించిన అల్లూ మారుతీకి తమ బ్యానర్ లోనే అల్లూ శిరీష్‌తో మరో సినిమా తీసే అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు..
అయితే ఇక్కడ అల్లు అరవింద్ నో అని చెప్పిన విషయం ఏంటంటే, తన జోక్యం వల్లనే 'కొత్తజంట' సినిమా అనుకున్నట్లు రాలేదని ఫీలయ్యారట. అందుకే ఈ నెక్స్ట్ సినిమాలో అలాంటి జోక్యం చేసుకొనని మారుతికి చెప్పారట... అది అల్లు అరవింద్ తనకు తానే విధించుకున్న నో ఎంట్రీ.
ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తునే ఉన్నాయి. ఆయన ఎంట్రి కుమారుడి చిత్రంలో మార్పుల నుంచి మొదలైందని అనుకోవచ్చేమో. రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'చిత్రంలో ఒక కీలక పాత్రకు రాజ్ కిరణ్ ని తీసుకున్నారు. ఇప్పుడు ఆయనను పక్కుకు పెట్టి, అదే పాత్రకు ప్రకాష్‌రాజ్‌ను ఓకే చేశారట. ఈ కొత్త మార్పుకి కారణం చిరంజీవి అని టాక్. చిత్రకథలోను ఆయన కొన్ని మార్పులు చేయబోతున్నారని, కుమారుని చిత్రాన్ని ఆయన పూర్తిగా దగ్గరుండి చూసుకోబోతున్నారని సమాచారం. చరణ్ గతంలో నటించిన నాయక్,రచ్చ, ఎవడు చిత్రాలకు కూడా చిరంజీవి ఇటువంటి మార్పులు చేసి, ఆ చిత్రాలు సక్సెస్ అయ్యేలా చూశారని అందుకే ఇప్పుడూ కూడా ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పుకుంటున్నారు పరిశ్రమ వర్గాలు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే'చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ఇతర ముఖ్య పాత్రధారులు పోషిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ నిర్మాత.
కుమారుల చిత్రాలకు సంబంధించి మెగా ఫ్యామిలీలో ఇద్దరు తండ్రుల ఎంట్రీ, నో ఎంట్రీ కథ.