English | Telugu
హైదరాబాద్ ఫ్లై ఓవర్ మీద ఒంటి మీద చొక్కా లేకుండా హీరో
Updated : Dec 29, 2023
ఆ హీరో సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎదగాలని అనుకున్న ఎంతో మందికి నటనలో శిక్షణ ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అలాగే అతని తండ్రి తల్లి కూడా చాలా మంచి నటులు. ఇప్పుడు వాళ్ళ నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వచ్చిన ఒక హీరోకి సంబంధించిన ఒక న్యూస్ సంచలనం సృష్టిస్తుంది.
రాజీవ్ కనకాల ,సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయమైన సినిమా బబుల్ గమ్. ఈ రోజు విడుదలైన ఈ మూవీ మిశ్రమ టాక్ ని అందుకుంది.మొన్నీ ఈ మధ్య మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రోషన్ మాట్లాడుతు బబుల్ గమ్ సినిమాకి సంబంధించిన ఒక సీన్ లో ఒంటి మీద షర్ట్ లేకుండా బైక్ మీద మూడుగంటలు పాటు తిరగానని చెప్పుకొచ్చాడు. పైగా ఆ సీన్ చెయ్యటం వల్ల తనలో అంతకు ముందు దాకా ఉన్న సిగ్గు మొత్తం కూడా పోయిందని చెప్పాడు. ఇప్పుడు రోషన్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
క్షణం , కృష్ణ అండ్ హిస్ లీల సినిమాల దర్శకుడు రవి కాంత్ పేరెపు దర్శత్వంలో వచ్చిన ఈ బబుల్ గమ్ లో రోషన్ సరసస మానస హీరోయిన్ గా నటించగా శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకత్వం వహించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి జె విశ్వక్ ప్రసాద్ మరొకరి భాగస్వామ్యంతో బబుల్ గమ్ ని నిర్మించాడు.