English | Telugu
రామ్ గోపాల వర్మ కొత్త చిత్రం 'రెడ్డి గారు పోయారు'
Updated : Mar 19, 2011
అయితే ఈ పేరు కూడా రామ్ గోపాల వర్మ ఇంకా కచ్చితంగా అనుకోవటం లేదు. ఈ పేరే గనక వర్మ తన చిత్రానికి పెడితే ఆర్థికంగా, సామాజికంగా బలమైన రెడ్డి సామాజిక వర్గం అతని మీద నిప్పులు చెరగటం ఖాయం. మొన్న రక్తచరిత్ర అని ఫ్యాక్షన్ మీద...ఆ తర్వాత అప్పల్రాజని సినిమా పరిశ్రమలోని కొందరి మీద, మీడియా మీద వ్యంగాస్త్రాలు కురిపించాడు.
బెజవాడ రౌడీలు అని విజయవాడ మీద తన బాణం ఎక్కుపెట్టాడు. ఇప్పుడు రాజకీయాల మీద, అక్కడ చక్రం తిప్పే రెడ్డి సామాజిక వర్గం మీద తన బాణం ఎక్కుపెడుతున్నాడు రామ్ గోపాల వర్మ. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లోని సమకాలీన రాజకీయాల్లో ఉండే కుట్రల వెనకాల ఉండే కుట్రల మీద వర్మ ఎక్కుపెడుతున్న బ్రహ్మాస్త్రం అనుకోవాలి.