English | Telugu
మంచు మనోజ్ సరసన శ్రియ
Updated : Mar 19, 2011
గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నిర్మించబడిన "శివాజీ" ది బాస్ చిత్రంలో శ్రియ హీరోయిన్ గా నటించింది. తర్వాత, రవితేజ హీరోగా నటించగా, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన "డాన్ శీను" చిత్రంలో శ్రియ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ప్రస్తుతం మంచు మనోజ్ కుమార్ సరసన శ్రియ హీరోయిన్ గా నటిస్తూంది.
ఈ చిత్రంలో శ్రియ పాత్ర రొటీన్ కు భిన్నంగా ఉంటుందని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న మంచు మనోజ్ కుమార్ కూడా ఈ చిత్రంలోని తన పాత్ర నచ్చే ఈ చిత్రంలో హీరోగా నటించటానికి అంగీకరించాడు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకుంది.