English | Telugu

రీమేక్ కి ర‌వితేజ గ్రీన్ సిగ్న‌ల్!

మాస్ మ‌హారాజా ర‌వితేజ కెరీర్ మేలి మ‌లుపు తిరిగిందే.. క‌న్న‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ `అప్పు`కి రీమేక్ అయిన `ఇడియ‌ట్` చిత్రంతో. ఆపై మ‌రికొన్ని రీమేక్స్ లో సంద‌డి చేసిన ర‌వితేజ‌.. రీసెంట్ టైమ్స్ లో స్ట్ర‌యిట్ స‌బ్జెక్ట్ ల‌కే ఓటేస్తూ ముందుకు సాగుతున్నారు. విడుద‌ల‌కు సిద్ధ‌మైన `ఖిలాడి`తో పాటు నిర్మాణంలో ఉన్న `రామారావు ఆన్ డ్యూటీ`, `ధ‌మాకా`, `రావ‌ణాసుర‌`, `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`.. ఇలా అన్ని సినిమాలు కూడా నాన్ - రీమేక్ మూవీస్ నే.

ర‌వితేజ నోట `ఖిలాడి` పాట‌.. డీఎస్పీ కాంబోలో ఫ‌స్ట్ టైమ్

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ స్టార్ హీరో ఓ రీమేక్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. రీమేక్స్ స్పెష‌లిస్ట్ గా తెలుగునాట ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియ‌ర్ డైరెక్ట‌ర్ భీమ‌నేని శ్రీ‌నివాస రావు.. తాజాగా ఓ మ‌ల‌యాళ మూవీ రీమేక్ కోసం ర‌వితేజ‌ని సంప్ర‌దించార‌ట‌. క‌థ న‌చ్చ‌డంతో ర‌వితేజ కూడా ఈ రీమేక్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని బ‌జ్. అయితే, అది ఏ సినిమా అన్న విష‌యంపై క్లారిటీ రాలేదు. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. గ‌తంలో ర‌వితేజ‌తో భీమ‌నేని రూపొందించిన `దొంగోడు` సినిమా కూడా మ‌ల‌యాళ చిత్రం `మీస మాధ‌వ‌న్`కి రీమేక్ నే. కాగా, త్వ‌ర‌లోనే ర‌వితేజ - భీమ‌నేని కాంబో మూవీపై స్ప‌ష్ట‌త రానున్న‌ది.

'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!