'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ వచ్చేసింది!
on Dec 6, 2021
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తోన్న 'రామారావు ఆన్ డ్యూటీ' విడుదల తేదీని ప్రకటించారు. శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీ మార్చి 25న థియేటర్లలో విడుదలవుతోంది. రిలీజ్ డేట్ పోస్టర్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసిన రవితేజ "#ramaraoonduty from 25th March 2022" అని ట్వీట్ చేశారు. ఈ పోస్టర్‌లో యాక్షన్ మోడ్‌లో ఉన్న రవితేజ ఒక కర్రను విసురుతున్నారు. బ్యాగ్రౌండ్‌లో రైతుల మాదిరిగా ఉన్న వ్యక్తులు కర్రలు పట్టుకొని పరిగెత్తుతుండగా, బారికేడ్లతో పోలీసులు వారిని అడ్డుకోవడం కనిపిస్తోంది. రెడ్ కలర్ షర్ట్, బ్లాక్ ట్రైజర్‌తో రవితేజ ఆహార్యం ఆకట్టుకుంటోంది.
యాక్షన్ థ్రిల్లర్‌గా తయారవుతున్న ఈ మూవీలో రవితేజ సరసన 'మజిలీ' ఫేమ్ దివ్యాంశ కౌశిక్, 'కర్ణన్' ఫేమ్ రాజీష విజయన్ నటిస్తున్నారు. వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రను చేస్తున్న ఈ సినిమాని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
Also read: 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ కోసం హైదరాబాద్ విచ్చేసిన 'డాటర్ ఆఫ్ సౌత్'!
నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, సార్పట్టా జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, 'ఈరోజుల్లో' శ్రీ, మధుసూదన్ రావు, సురేఖా వాణి తారాగణమైన ఈ చిత్రానికి శామ్ సిఎస్ మ్యూజిక్ సమకూరుస్తుండగా, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
Also read: 'స్కైలాబ్' మూవీ రివ్యూ
కాగా రవితేజ మరో సినిమా 'ఖిలాడి' ఫిబ్రవరి 11న విడుదల కానున్నది. అంటే.. వరుసగా రెండు నెలల్లో రెండు సినిమాలతో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు రవితేజ.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
