English | Telugu

4 గంట‌లు బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్ట్‌లో న‌ర‌క‌యాత‌న ప‌డ్డ‌ వ‌నిత‌.. ఎందుకో తెలుసా?

అల‌నాటి అందాల న‌టి దివంగ‌త మంజుల కుమార్తె, బిగ్ బాస్ త‌మిళ్ ఫేమ్ వ‌నిత విజ‌య‌కుమార్ ఇటీవ‌ల ఒక క్లోజ్ ఫ్రెండ్‌ను క‌లుసుకోవాల‌ని బ్యాంకాక్‌కు బ‌య‌లుదేరి వెళ్లింది. కానీ అనుమ‌తి ల‌భించ‌క‌పోవ‌డంతో నాలుగ్గంట‌ల పాటు అక్క‌డి ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండాల్సి వ‌చ్చింది. బ్యాంకాక్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌లో నాలుగ్గంట‌ల పాటు తాను ప‌డ్డ బాధ‌ను సోష‌ల్ మీడియా ద్వారా వివ‌రంగా చెప్పుకొచ్చింది వ‌నిత‌.

త‌న విష‌యంలో జ‌రిగిన‌దంతా ఒక స్కామ్ అనీ, థాయిలాండ్‌లోకి అడుగుపెట్టాలంటే ఒక స‌ర్టిఫికెట్ ప్రింట‌వుట్ కావాల్సి వ‌చ్చింద‌నీ, ప్ర‌యాణానికి ముందే దాని కోసం తాను అప్లై చేశాన‌నీ ఆమె చెప్పింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఆమె ప్ర‌యాణించిన ఎయిర్‌లైన్స్ మేనేజ‌ర్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రింట‌ర్స్ లేవ‌నీ, అందువ‌ల్ల థాయిలాండ్‌లోకి అడుగుపెట్టాలంటే ఇండియాకు తిరిగివెళ్లి ఆ ప్రింట‌వుట్‌ను తెచ్చుకోవాల‌ని చెప్పాడు. అయితే ఆ త‌ర్వాత ఎట్ట‌కేల‌కు ఆమెను ఆ దేశంలోకి రానిచ్చారు.

Also read:'ఊ అంటావా మావ'.. సమంత తగ్గేదేలే!

శ్రీ‌లంక‌న్ ఎయిర్‌లైన్స్ స్కామ్‌.. మూడు గంట‌ల నుంచీ ఎయిర్‌పోర్ట్ ఇమ్మిగ్రేష‌న్‌లో చిక్కుకుపోయాను. బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్ ఎడారిలా ఉంది.. ఫుడ్ లేదు, కాఫీ లేదు, మొత్తం బ్యాంకాక్ సువ‌ర్ణ‌భూమి ఎయిర్‌పోర్ట్‌లో ప్రింట‌ర్ లేదు. ఎలిజిబుల్ అయిన ప్ర‌యాణీకులకు వీసా కోసం ప్రింట్ తీసుకోవ‌డానికి ప్రింట‌ర్ లేదు.. బ్యాంకాక్‌కు రావ‌డానికి ఎప్ప‌టికీ వీసా ఉంటుంది. ఇప్పుడు థాయ్‌లీ పాస్ అనే ఎంట్రీ స‌ర్టిఫికెట్ కావాల‌నే పాల‌సీ పెట్టారు. ఇండియా నుంచి దాన్ని నేను పొందాను కానీ ప్రింట‌ర్ లేనికార‌ణంగా ఆ దేశంలోకి ప్ర‌వేశించ‌లేక‌పోతున్నా. శ్రీ‌లంక‌న్ ఎయిర్‌లైన్స్ చాలా రూడ్‌గా, అనైతికంగా వ్య‌వ‌హ‌రించింది. టికెట్ రేట్ల‌ను బాగా పెంచిన త‌ర్వాత ప‌ట్టించుకోవ‌ట్లేదు. వాళ్ల మేనేజ‌ర్ న‌న్ను కొత్త టికెట్ కొని, ఇండియాకు వెళ్లి ప్రింట‌వుట్ తీసుకొని ర‌మ్మ‌ని చెప్తున్నాడు అని ఎయిర్‌పోర్ట్ నుంచే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Also read:థియేట‌ర్‌లో సినిమా చూడ్డానికి ఆటోలో వ‌చ్చిన శ్రియ‌!

ఆ త‌ర్వాత, "నాలుగు గంట‌ల‌పాటు ప‌ట్టువ‌ద‌ల‌కుండా ప్రాక్టిక‌ల్ అప్రోచ్‌తో, అవ‌గాహ‌న‌తో పోరాడాక‌, స‌క్సెస్‌ఫుల్‌గా థాయిలాంట్‌లోకి అడుగుపెట్టాను. నాకు మ‌ద్ద‌తుగా నిలిచిన‌, మాన‌వ‌త్వంతో వ్య‌వ‌హ‌రించిన ఇమ్మిగ్రేష‌న్ పోలీసుల‌కు, ఎయిర్‌పోర్ట్ పాసెంజ‌ర్ స‌ర్వీస్‌కు ధ‌న్య‌వాదాలు" అని మ‌రో పోస్ట్ పెట్టిందామె.