English | Telugu

పాండెమిక్ కూడా విడదీయలేకపోయింది.. మాది ట్రూ ఫ్రెండ్ షిప్!

శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన 'ఆర్ఆర్ఆర్' ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది మూవీ టీమ్. ఈ సినిమాలో దేశభక్తి ప్రధాన అంశం కాదని, ఇద్దరి మధ్య స్నేహాన్ని చూపించడమే ఈ మూవీ ప్రధాన ఉద్దేశమని డైరెక్టర్ రాజమౌళి అన్నారు. ఈ సినిమాలో ఎక్కడా చరిత్రను చూపించట్లేదని, ఇది పూర్తి కల్పిత కథ అని చెప్పారు. ఈ సినిమాలో పునర్జన్మల ప్రస్తావన కూడా ఉండదని తెలిపారు. ఈ సినిమా కథ 95 శాతం ఢిల్లీలోనే జరుగుతుందని ఆసక్తికర విషయాన్ని చెప్పారు రాజమౌళి. గోండుల కాపరి అయిన భీమ్ ఒక పని మీద సిటీ(ఢిల్లీ)కి వస్తాడని, అక్కడే రామ్ తో స్నేహం ఏర్పడుతుందని తెలుస్తోంది.

Also Read:తారక్, చరణ్ వల్ల టైం వేస్ట్ అయింది!

'ఆర్ఆర్ఆర్' మూవీ ఫ్రెండ్ షిప్ గురించి ప్రధానంగా ఉంటుందని రాజమౌళి చెప్పడంతో.. ఆన్ స్క్రీన్ మీద ఆ ఫ్రెండ్ షిప్ పండాలంటే, ఆఫ్ స్క్రీన్ లో కూడా ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉండాలి కదా అని మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి తారక్, చరణ్ చెప్పిన సమాధానం ఆకట్టుకుంది. 'మా స్నేహం ఆర్ఆర్ఆర్ తో మొదలైంది కాదని, ఆర్ఆర్ఆర్ కి ముందే తమ మధ్య ఫ్రెండ్ షిప్ ఉందని' తారక్ అన్నాడు. అంతేకాదు తమ ఇళ్లు దగ్గర కావడంతో పాండెమిక్ టైంలో కూడా ఒకరింటికి ఒకరం వెళ్లి సరదాగా టైం స్పెండ్ చేసే వాళ్లమని తారక్ చెప్పుకొచ్చాడు.

Also read:అక్క‌డ నేనొక‌దాన్ని ఉన్నాన‌నే ధ్యాస‌లేకుండా తార‌క్‌, చ‌ర‌ణ్ తెగ క‌బుర్లు చెప్పుకునేవారు!

తమది ట్రూ ఫ్రెండ్ షిప్ అని చరణ్ అన్నాడు. ఏ బంధంలోనైనా చిన్న చిన్న విభేదాలు సహజమని, అలాంటివి వచ్చినప్పుడు కూడా మా ఫ్రెండ్ షిప్ ఎంత బలంగా ఉందనేది మా మనసులని మేం ప్రశ్నించుకుంటామని.. దాని తర్వాత కూడా సస్టైన్ అయితే అది ట్రూ ఫ్రెండ్ షిప్ అని అన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్ షిప్ నటించే ఉద్దేశం మా ఇద్దరికీ లేదని చెప్పాడు. ఇన్నేళ్ళుగా ఇంత బలంగా ఉందంటే మాది ట్రూ ఫ్రెండ్ షిప్ అని చరణ్ చెప్పుకొచ్చాడు.