English | Telugu

షార్ట్ ఫిలింలో కమల్, రజనీ

గతంలో కమల్ హాసన్, రజనీకాంత్ కలసి తెలుగులో " అంతులేని కథ, అందమైన అనుభవం, వయసు పిలిచింది" వంటి అనేక చిత్రాల్లోనూ తమిళ్ లో"పదునారు వయదునిళే" వంటి సూపర్ హిట్ మూవీలోనూ నటించారు. ఆ తర్వాత రజనీకాంత్ సుపర్ స్టార్ గానూ, కమల్ హాసన్ లోకనాయకుడిగా మారిన తర్వాత మాత్రం రజనీకాంత్, కమల్ హాసన్ కలసి నటించలేదు. కమల్ హాసన్, రజనీ కాంత్ కలిపి ఒక చిత్రం తీయాలనుకున్న దర్శకుడు కె.యస్.రవికుమార్ ప్రయత్నించినా, అతనికి సాధ్యం కాక ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు.


అయితే ప్రస్తుతం కమల్ హాసన్, రజనీకాంత్ లకు గురువైన దర్శకస్రష్ట కె.బాలచందర్ సలహా మేరకు వాళ్ళిద్దరు కలసి ఒక షార్ట్ ఫిలింలో నటించబోతున్నారు. ఈ షార్ట్ ఫిలిం నిర్మిస్తూంది ఒక మంచి పని కోసం కనుక కమల్ హాసన్, రజనీకాంత్ లు ఆ షార్ట్ ఫిలింలో నటించాల్సిందిగా బాలచందర్ ఆదేశించారు. తమకు గురువైన ఆయన మాటలను కాదనలేక కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ ఆ షార్ట్ ఫిలింలో కలసి నటించటానికి నిర్ణయించుకున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.