English | Telugu

50 సినిమాలు పూర్తిచేసిన ఛార్మి

అందాల పంజాబీ భామ హీరోయిన్ ఛార్మికౌర్ "నీతోడు కావాలి" చిత్రంతో హీరోయిన్ గా తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే ప్రముఖ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. ఇటీవల విడుదలైన "మంగళ" చిత్రంతో ఛార్మి హీరోయిన్ గా అర్థశతచిత్రాలను అంటే 50 సినిమాలను పూర్తిచేసుకుంది. ఒకప్పుడు సావిత్రి, అంజలీదేవి, కృష్ణ కుమారి, షావుకారు జానకి వంటి వారు ఇలా వందల కొద్ది చిత్రాల్లో నటించేవారు.

ఆ తర్వాత జయప్రద, జయసుధ వంటి హీరోయిన్లు అలా వంద చిత్రాలకు పైగా పూర్తి చేసుకున్నారు. కానీ నేటి హీరోయిన్లు పట్టుమని పది చిత్రాలను కూడా పూర్తిచేయకుండానే కనుమరుగవుతున్నారు.ఇలాంటి సమయంలో ఛార్మి 50 చిత్రాలను పూర్తిచేయటం విశేషమనే చెప్పాలి. ఈ సందర్భంగా ఛార్మికి తెలుగువన్ శుభాకాంక్షలు తెలుపుతోంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం