English | Telugu

యు.యస్.లో పవన్ కళ్యాణ్ "తీన్ మార్"

పవన్ కళ్యాణ్ "తీన్ మార్" షూటింగ్ అమెరికాలో జరుగనుంది. విషయానికొస్తే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం "తీన్ మార్". ఈ "తీన్ మార్" చిత్రం ప్రస్తుతం రెండు పాటలు తప్ప సినిమా మొత్తం పూర్తయింది. పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రంలో మిగిలిన రెండు పాటల్లోఒక పాటను హైదరాబాద్ శివార్లలో ప్రస్తుతం చిత్రీకరించారు.

కాగా పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రంలో మిగిలిన ఆఖరి పాటను యు.యస్.లో చిత్రీకరించనున్నారు. అందుకోసం పవన్ కళ్యాణ్ మార్చ్ 6 వ తేదీన యు.యస్. బయలు దేరుతున్నారు. ఈ పాట చిత్రీకరణ పూర్తికాగానే నిర్మాణానంతర కార్యక్రమాలను పుర్తి చేసుకుని ఏప్రెల్ నెలలో పవన్ కళ్యాణ్ "తీన్ మార్" విడుదల కానుంది. ఏప్రెల్ రెండవ వారంలో ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రం ఆడియో విడుదల జరుగనుంది.