English | Telugu

'శ్యామ్‌ సింగరాయ్' దర్శకుడితో విజయ్ దేవరకొండ!

విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా చేస్తున్నాడు. అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా, పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. వీటితో పాటు తాజాగా మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించనున్నాడని వినికిడి.

రాహుల్ దర్శకత్వంలో విజయ్ గతంలో 'టాక్సీవాలా' సినిమా చేయగా అది విజయం సాధించింది. ఆ తర్వాత రాహుల్, నాని హీరోగా 'శ్యామ్‌ సింగరాయ్' చిత్రాన్ని చేశాడు. అది కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు రాహుల్ మరోసారి విజయ్ తో సినిమా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ ఫిల్మ్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని సమాచారం.