English | Telugu

ప్రభాస్ మూవీపై రాహుల్ రవీంద్రన్ కీలక వ్యాఖ్యలు..నటిస్తున్నాడని కన్ఫార్మ్ అయ్యింది

ప్రభాస్ మూవీపై రాహుల్ రవీంద్రన్ కీలక వ్యాఖ్యలు..నటిస్తున్నాడని కన్ఫార్మ్ అయ్యింది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)హను రాఘవపూడి(Hanu Raghavapudi)కాంబోలో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 1940 వ సంవత్సరంలో జరిగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కుతుండగా 'ఫౌజీ'(Fouji)అనే  టైటిల్ ప్రచారంలో ఉంది. సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ(Imanvi)హీరోయిన్ గా చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. చిత్రీకరణ కూడా ప్రారంభమైన ఈ మూవీపై ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ మూవీలో ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఒక కీలక పాత్రలో చేస్తున్నాడు. ఈ విషయాన్నీ చిత్ర బృందం వెల్లడి చెయ్యకపోయినా, స్వయంగా రాహుల్ రవీంద్రన్ నే చెప్పడం విశేషం   రీసెంట్ గా రాహుల్ రవీంద్రన్ ఒక విభిన్నమైన లుక్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ హను రాఘవపూడి సినిమాలో చేస్తున్నాను. అందుకే ఈ లుక్ ని కొనసాగిస్తున్నాని చెప్పుకొచ్చాడు. 

తమిళ చిత్ర సీమకి చెందిన రాహుల్ రవీంద్రన్  2010 లో తమిళంలో తెరకెక్కిన 'మాస్కో విన్ కావేరి' అనే చిత్రంతో హీరోగా తన సినీ జర్నీని ప్రారంభించాడు. ఆ తర్వాత తెలుగులో అందాల రాక్షసి, పెళ్లి పుస్తకం,అలా ఎలా' వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించడంతో పాటు పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. చిలసౌ మూవీతో దర్శకుడుగా మారి ప్రస్తుతం రష్మిక టైటిల్ రోల్ లో 'ది గర్ల్ ఫ్రెండ్' అనే  క్రేజీ ప్రాజెక్టుని తెరకెక్కిస్తున్నాడు.  

 

 

ప్రభాస్ మూవీపై రాహుల్ రవీంద్రన్ కీలక వ్యాఖ్యలు..నటిస్తున్నాడని కన్ఫార్మ్ అయ్యింది

సు ఫ్రమ్ సో తర్వాతనా.. రక్షించడానికి మతం కావాలి

తమ ముందుకు వచ్చిన చిత్రం చిన్నదా,పెద్దదా, స్టార్ కాస్టింగ్ ఉందా లేదా అనేది చూడకుండా కంటెంట్, స్క్రీన్ ప్లే బాగుండటంతో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టే చిత్రాలు అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతుంటాయి. అలాంటి ఒక చిత్రమే 'సు ఫ్రమ్ సో(Su from So).కన్నడంలో తెరకెక్కగా  తెలుగు నాట కూడా రిలీజయ్యి ఘన విజయాన్ని అందుకుంది. మిస్టరీ కామెడీగా తెరెకెక్కిన ఈ చిత్రంలో 'కరుణాకర్ గురూజీ' అనే క్యారక్టర్ లో అత్యద్భుతంగా నటించి అశేష అభిమానులని సంపాదించుకున్నాడు రాజ్ బి శెట్టి . దీంతో రాజ్ బి శెట్టి(Raj B Shetty)తదుపరి చిత్రం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

భైరవద్వీపం మూవీకి 30 రూపాయలు జీతం ఇచ్చారు..

ఆహా ఇండియన్ ఐడల్ ఈ వారం ఎపిసోడ్ లో లేడీ రాక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న బృంద వచ్చి " నరుడా ఓ నరుడా" అనే సాంగ్ పాడింది. జడ్జెస్ అందరూ ఫిదా ఇపోయారు. ఇక థమన్ ఈ సాంగ్ తనకు ఎందుకు గొప్ప మెమొరీనో చెప్పుకొచ్చారు. "ఈ పాట పాడిన వెంటనే నేను మా నాన్నకు భోజనం తీసుకెళ్ళాను. ఆయన ఈ భైరవ ద్వీపం సినిమా మొత్తానికి మ్యూజికల్ ఇన్ఛార్జ్. 70 ఎంఎంలో రికార్డింగ్ థియేటర్ లో ఒక సాంగ్ వినడం అదే మొదటిసారి. ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఈ సినిమాలో రోజా గారు బెడ్ పడుకుని కదులుతూ ఉండే టైములో బెడ్ లేస్తుంది. అందులోంచి ఒక టింపని అనే డ్రం వస్తుంది. దాన్ని నేను వాయించాను. దానికి నాకు 30 రూపాయలు జీతం ఇచ్చారు. ఆ డ్రం పెడల్ నొక్కాలంటే 50 కిలోల బరువు ఉండాలి. కాలు దగ్గర ఒకతను ప్రెస్ చేస్తే నేను పైన డ్రమ్స్ వాయించాను. మా నాన్న నన్ను ఎత్తుకుంటే నేను వాయించాను. నాకు ఆ మెమరీ చాలా స్వీట్ గా ఉంటుంది తలుచుకున్నప్పుడల్లా. ఇంకా జానకమ్మ పాటలు పాడే విషయంలో ఎంత సెన్సిటివ్ ఉంటారో నాకు తెలుసు. అప్పుడు ఒక భయం ఉండేది.