English | Telugu

అమీర్ ఖాన్ మూవీపై ఇన్ఫోసిస్ సుధామూర్తి కీలక వ్యాఖ్యలు.. మీకు కనువిప్పు కలుగుతుందా!

బాలీవుడ్ స్టార్ హీరో 'అమీర్ ఖాన్'(Aamir Khan)ఈ నెల 20 న 'సితారే జమీన్ పర్'(Sitare Zameen Par)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. స్పోర్ట్స్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి 'ఆర్ ఎస్ ప్రసన్న' దర్శకత్వం వహించగా అమీర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మానసిక పరిపక్వత చెందని పిల్లలని గుల్షన్ అనే వ్యక్తి వాలీబాల్ క్రీడలో విజేతలుగా ఎలా నిలిపాడనే పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. గుల్షన్ క్యారక్టర్ లో అమీర్ ఖాన్ విజృంభించి నటించాడు. ఇటీవల రిలీజైన ట్రైలర్ తో ఈ విషయం అర్ధంకావడంతో పాటు మూవీపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక కొంత మంది ప్రముఖుల కోసం 'సితారే జమీన్ పర్' ప్రీమియర్ షో ని ప్రదర్శించడం జరిగింది. వారిలో 'ఇన్ఫోసిస్'(Infosys)అధినేత 'ఆర్ నారాయణమూర్తి' సతీమణి 'పద్మభూషణ్ సుధామూర్తి'(Sudha Murthy)కూడా ఉన్నారు. మూవీని వీక్షించిన అనంతరం ఆమె మాట్లాడుతు మానసిక సవాళ్ళని ఎదుర్కునే పిల్లల మనసు చాలా స్వచంగా ఉండటంతో పాటు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఎప్పుడు ఆనందంగా నవ్వుతు ఎదుటి వాళ్ళు ఏదైనా సాధించి సంతోషంగా ఉంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. అలాంటి వారి నుంచి మనం గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చు. కానీ మానసిక సవాళ్ళని ఎదుర్కునే పిల్లలని చాలా మంది అర్ధం చేసుకోరు. అలాంటి వాళ్ళని ఎలా అర్ధం చేసుకోవాలి. ఎలా మద్దతు ఇవ్వాలనే అంశాన్ని మూవీలో చాలా చక్కగా చూపించారు.
సితారే జమీన్ పర్ సమాజంలో మార్పు తీసుకురావడంతో పాటు కనువిప్పు కలిగించిన చిత్రంగా నిలుస్తుంది. మానసిక వికలాంగులని తక్కువ అంచనా చేసి చూడకూడదనే గొప్ప సందేశాత్మక చిత్రమని ఆమె చెప్పుకొచ్చింది.

అమీర్ ఖాన్, జెనీలియా జంటగా నటించిన ఈ చిత్రంలో అరౌస్ దత్త, గోపి కృష్ణన్ వర్మ, వేదాంత్ శర్మ, నమన్ మిశ్రా, రిషబ్ జైన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శేఖర్ ఎహసాన్ సంగీతాన్ని అందించాడు. 2018 లో స్పానిష్ భాషలో రిలీజైన 'ఛాంపియన్స్' మూవీని ఆధారంగా సితారే జమీన్ పర్ తెరకెక్కింది. తెలుగు లాంగ్వేజ్ లో కూడా మూవీ విడుదల కానుంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.