English | Telugu

రాహుల్ రవీంద్రన్ ఇంట్లో విషాదం

2012 లో 'హను రాఘవపూడి'దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన'అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన తమిళ నటుడు రాహుల్ 'రవీంద్రన్'(Rahul Ravindran) ఆ తర్వాత కూడా పలు తెలుగు,తమిళ చిత్రాల్లో ఎన్నో విశిష్టమైన క్యారెక్టర్స్ ని పోషించి,అటుపై దర్శకుడుగా కూడా టర్న్ అయ్యి నాగార్జునతో 'మన్మధుడు 2 ',సుశాంత్ తో 'చిలాసౌ' వంటి చిత్రాలని తెరకెక్కించాడు.

ఈ రోజు ఉదయం రాహుల్ రవీంద్రన్ తండ్రి రవీంద్రన్ నరసింహన్(Ravindran narasimhan)మరణించడం జరిగింది.అనారోగ్య సమస్యలతోనే ఆయన చనిపోయినట్టుగా తెలుస్తుంది.తండ్రి మరణ వార్తని తట్టుకోలేని రాహుల్ రవీంద్రన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తు 'నేను 'చిలసౌ' మూవీలో ఒక లైన్ రాశాను.'నాన్న ఉన్నారులే చూసుకుంటారు అనే మాటకి విలువ, నాన్నని కోల్పోయిన వాళ్లకే తెలుస్తుంది.ఈరోజు నాకు తెలుస్తుంది.ఇది ఎప్పటికీ పూరించలేని వాక్యూమ్‌ను వదిలివేస్తుంది ఎప్పటికీ మాటల్లో వివరించలేని భావాలను మీకు వదిలివేస్తుంది.ధన్యవాదాలు నాన్న.ఐ లవ్ యు అంటూ ట్వీట్ చేసాడు.

రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం రష్మిక(Rashmika mandanna)ప్రధాన పాత్రలో గీతాఆర్ట్స్ లో తెరకెక్కుతున్న 'ది గర్ల్ ఫ్రెండ్'(The Girl Frined)చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ పై ఉంది.రాహుల్ రవీంద్రన్ వైఫ్ ప్రముఖ స్టార్ సింగర్, స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి(Chinmayi)అన్న విషయం తెలిసిందే.