English | Telugu
జపాన్ లో 'ఆర్ఆర్ఆర్' మరో సంచలన రికార్డు!
Updated : Jan 10, 2023
జపాన్ లో 'ఆర్ఆర్ఆర్' ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జపాన్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్.. మరో మైలురాయిని అందుకుంది. తాజాగా 500 మిలియన్ మార్క్ క్రాస్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
గతేడాది అక్టోబర్ 21న జపాన్ లో విడుదలైన ఆర్ఆర్ఆర్ విజయవంతంగా 80 రోజులు పూర్తి చేసుకొని, ఇప్పటికీ విశేష ఆదరణ పొందుతోంది. ఇప్పటిదాకా అక్కడ మూడు లక్షలకు పైగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించారు. దీంతో 505 మిలియన్ కి పైగా యెన్స్ కలెక్ట్ చేసింది. త్వరలో 600 మిలియన్ మార్క్ అందుకున్నా ఆశ్చర్యంలేదు అంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరికొన్ని దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఆస్కార్ నామినేషన్స్ దిశగానూ ఈ సినిమా అడుగులు వేస్తోంది.