English | Telugu
ప్రముఖ హీరోయిన్ కి పవన్ కళ్యాణ్ డాక్టర్ సీట్ ఇప్పిస్తున్నాడా!
Updated : Aug 14, 2024
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)హీరోయిన్ అంటే ఇండస్ట్రీ లోపల బయట ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. తోటి హీరోయిన్ల లో అయితే ఈర్ష్య కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు ఆ రెండిటిని కంబైన్డ్ గా మోస్తున్న హీరోయిన్ ప్రియాంక మోహన్(priyanka mohan).ఓజి హీరోయిన్ హోదాలో ఆమెకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
పవన్ కళ్యాణ్(pawan kalyan)పొలిటికల్ బిజీలో కనుక లేకపోయిఉంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 27 న ఓజి(og)థియేటర్స్ లో ల్యాండ్ అయ్యుండేదీ. ఇప్పుడు సరికొత్త డేట్ కోసం ఎదురుచూస్తుంది. ఇక పవన్ కి జోడిగా ప్రియాంక చేస్తుందన్న దగ్గరనుంచి ఆమె క్యారక్టర్ ఎలా ఉండబోతోందనే చర్చ సినీ ప్రేమికుల్లో వస్తూనే ఉంది.ఎందుకంటే తన ఫస్ట్ మూవీ నాని గ్యాంగ్ లీడర్ నుంచి తన క్యారక్టర్ కి ప్రిఫర్ ఉంటేనే సదరు మూవీకి కమిట్ అవుతుంది. పైగా ఆ క్యారక్టర్ ద్వారా తన కంటూ ఒక బెంచ్ మార్కుని కూడా క్రియేట్ చేసుకుంటుంది. అందుకే తనకి ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు. ఇక రీసెంట్ గా ఓజి లో ప్రియాంక చెయ్యబోయే క్యారక్టర్ అధికారకంగా బయటకి వచ్చింది. ప్రియాంక డాక్టర్ గా కనిపించబోతుంది. పైగా పవన్ రోల్ కి డాక్టర్ గానే పరిచయం అవుతుందని, ఇద్దరి మధ్య బ్యూటిఫుల్ సీన్స్ కూడా ఉంటాయనే టాక్ కూడా వినిపిస్తుంది. ప్రియాంక పేరు అలకనంద అని మేకర్స్ ఇంతకు ముందే చెప్పిన విషయం తెలిసిందే.
ఇక డాక్టర్ అలకనంద న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పవన్ ఫ్యాన్స్ లో ఒక చర్చ కూడా మొదలయ్యింది. ఓ జి లో పవన్ గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తున్నాడు కాబట్టి ప్రియాంక కి పవనే తన రికమండేషన్ తో డాక్టర్ సీట్ ఇప్పిస్తాడా అని కూడా అనుకుంటున్నారు. ఏది ఏమైనా సినిమా రిలీజ్ అయితే గాని అసలు విషయం తెలియదు. ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్య ఓజి ని నిర్మిస్తుండగా సుజిత్(sujeeth)దర్శకుడు.ప్రభాస్ తో సాహూ ని తెరకెక్కించిన దర్శకుడు కావడంతో పవన్ ఫ్యాన్స్ లో ఓజి పై ఒక రేంజ్ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ఆల్రెడీ విడుదలైన టీజర్, గ్లింప్స్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకెళ్తున్నాయి. తమన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.