English | Telugu

అల్లు అర్జున్ నంద్యాల ఎందుకు వెళ్ళాడో బయటకొచ్చిన  అసలు నిజం..ఆర్మీ ఇప్పుడు ఏమంటుంది

అల్లు అర్జున్(allu arjun)ముద్దు పేరు బన్నీ ని తన ఇంటి పేరుగా మార్చుకొని, ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ చిత్రాలని నిర్మిస్తున్న వ్యక్తి బన్నీ వాస్. ఒక రకంగా బన్నీ ఆత్మ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మాట నిజమని అల్లు అర్జున్ స్పీచ్ ద్వారా చాలా సార్లు రుజువయ్యింది. ఇక గత కొన్ని రోజుల నుంచి ఆ ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బన్నీ వాస్ లేటెస్ట్ స్పీచ్ వైరల్ గా మారింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)బావమరిది నార్నె నితిన్ హీరోగా ఈ నెల 15 న విడుదల కాబోతున్న మూవీ ఆయ్. గీత ఆర్ట్స్ 2 పై బన్నీ వాసు(bunny vasu)నే నిర్మించాడు.రీసెంట్ గా ఆయ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం లో జరిగిన ఈ కార్యక్రమంలో బన్నీ వాసు మాట్లాడుతు నాకు కష్టం వచ్చిందంటే ఎప్పుడు ఇద్దరు వ్యక్తులు ముందుంటారు. ఒకరు నా తల్లి, రెండు అల్లు అర్జున్.స్నేహితుడికి అవసరం ఉందంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా అల్లు అర్జున్ అండగా ఉంటాడు. ఆయ్ సినిమా ప్రచార కార్యక్రమాలు సరిగ్గా జరగడం లేదని బన్నీ గారి చేత సినిమా గురించి ట్వీట్ చేయమని అడగండని మా టీం నాతో చెప్పింది. కానీ నేను అడగలేదు. నేను సమాచారం ఇవ్వకుండానే ఆయ్ గురించి బన్నీ గారు ట్వీట్ చేసారు. ఒక స్నేహితుడికి కష్టం వస్తే తనకి ఎలా సపోర్ట్ చెయ్యాలో తెలిసిన ఏకైక వ్యక్తి కూడా ఆయనే అని చెప్పాడు.అలాగే గతంలో జరిగిన ఒక సంఘటన గురించి కూడా చెప్పుకొచ్చాడు.

ఇరవై ఏళ్ళ క్రితం నేను గీత ఆర్ట్స్ నుంచి వెళ్లిపోవాలిసిన పరిస్థితి వచ్చింది. కానీ బన్నీ గారు నా కోసం వాళ్ళ నాన్న అరవింద్ గారిని కూడా ఎదిరించి నాకు సపోర్ట్ గా నిలబడ్డాడని చెప్పాడు. ఇప్పుడు బన్నీ వాస్ చెప్పిన ఈ మాటలతో బన్నీ గతంలో తన మావయ్య పవన్ ప్రతి పక్ష పార్టీలో ఉన్నాడనేది కూడా చూసుకోకుండా వైసిపీ పార్టీ తరుపున పోటీ చేసిన తన ఫ్రెండ్ శిల్ప రవి చంద్ర రెడ్డి కి సపోర్ట్ చేసిన విషయాన్నీ గుర్తు చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ కూడా బన్నీ వాస్ మాటలని హైలట్ చేస్తుంది.