English | Telugu

బాలకృష్ణ కి మూడు పదవులు! నటన తనకి దైవంతో సమానం 

యువరత్న బాలకృష్ణ (balakrishna)ఉరఫ్ బాలయ్య ఉరఫ్ ఎన్ బి కే.. ఈ నందమూరి నట సింహం తెలుగు తెర మీద సృష్టించని రికార్డు లేదు. నాలుగు దశాబ్దాల నుంచి ఇదే తంతు. నో చేంజ్.ఎప్పటికప్పుడు ఎక్స్ టెన్షనే గాని నో కాంప్రమైజ్. పైగా సుదీర్ఘ కాలం నుంచి తెలుగు సినిమా వంద రోజులకి మొహమాసి డల్ గా నిల్చుంటే, నీకు నేనున్నా అంటు నాలుగు వందలు రోజులు కట్టబెట్టిన, కట్టబెడుతున్న హిస్టరీ కూడా బాలయ్య సొంతం. ఎనీ క్యారక్టర్ అందులో బాలయ్య మార్క్ ఉండాల్సిందే. తాజాగా బాలయ్య మూడు పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించబోతున్నాడనే చర్చ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

బాలయ్య ప్రస్తుతం తన 109 సినిమాని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్ బి కే 109(nbk 109)పేరుతో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)కి వాల్తేరు వీరయ్య తో భారీ హిట్ అని అందించిన బాబీ(bobby kolli)దర్శకుడు. పైగా హీరోల కొలతల ప్రకారం మూవీని తెరక్కించడం లో బాబీ ఎక్సపర్ట్. దీంతో బాలయ్య మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీలో బాలయ్య మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి..ఆల్రెడీ ఫస్ట్ గ్లింప్స్ లో బాలయ్య లుక్ ని అందరు చూసారు. అదే విధంగా ఇంకొన్ని సందర్భాల్లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కూడా కనిపించాడు. ఇక రీసెంట్ దర్శకుడు బాబీ ఇచ్చిన ఒక పోస్ట్ తో ఆ రెండు కాకుండా పూర్తిగా గడ్డం లేకుండా బాలయ్య దర్శనం ఇచ్చారు. ఇలా త్రీ డిఫరెంట్ లుక్స్ లో మెరవబోతున్నాడనే చర్చ అయితే చాలా బలంగానే వినిపిస్తుంది. మరి ఇదే కనుక నిజమైతే నటనని దైవంగా భావించే బాలయ్య మూడు పదవుల్లో మెస్మరైజ్ చెయ్యడం ఖాయం.

ఇక కొన్ని నెలల క్రితం విడుదలైన గ్లింప్స్ అండ్ అందులోని బాలయ్య డైలాగ్స్ అయితే ఒక రేంజ్ లోనే ఉన్నాయి. ఫ్యాన్స్ అయితే అప్పట్నుంచి బాలయ్య కొట్టబోయే సరికొత్త రికార్డుల హంటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. థమన్(thaman)సంగీతాన్ని అందిస్తుండగా బాబీ డియోల్ ప్రతి నాయకుడుగా కనిపిస్తున్నాడు. చిరు తో వేర్ ఈజ్ ది పార్టీ అంటూ చిందులేసిన ఊర్వశి రౌటేలా వన్ అఫ్ ది హీరోయిన్ గా చేస్తుంది. భారీ చిత్రాలని నిర్మించడంతో పాటు హిట్ చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సూర్యదేవర నాగ వంశీ తన సితార ఎంటర్టైన్మెంట్స్(sithara entertainments)పై నిర్మిస్తున్నాడు. భీమ్లా నాయక్, టిల్లు స్క్వేర్, జర్సీ, మాడ్ , సార్, వంటి హిట్ చిత్రాలు ఈ సంస్థలో ఉన్నాయి.