English | Telugu
ఓజీ గురించి షాకింగ్ న్యూస్.. ఇది అసలు ఊహించలేదు..!
Updated : Jun 4, 2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) త్వరలో 'హరి హర వీరమల్లు'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆ తర్వాత 'ఓజీ' లైన్ లో ఉంది. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీ.. సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి ఫ్యాన్స్ లో ఉంది. ఇలాంటి సమయంలో షూటింగ్ కి సంబంధించిన న్యూస్ ఒకటి ఆసక్తికరంగా మారింది.
'ఓజీ' షూటింగ్ తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. నిన్నటితో ముంబై షెడ్యూలు పూర్తయింది. రేపటి నుంచి విజయవాడ షెడ్యూలు మొదలు కానుంది. తాడేపల్లిలో 10 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూలులో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ తో మొత్తం షూట్ పూర్తి అవుతుందని సమాచారం.
నిజానికి 'ఓజీ' షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా చాలా రోజులు పడుతుందని అందరూ భావించారు. కానీ, పది రోజుల్లో మొత్తం షూటింగ్ పూర్తి కానుందన్న వార్త ఆశ్చర్యం కలిగించేదే. ఈ న్యూస్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
