English | Telugu

ఖరీదైన వాటిని కోల్పోయిన నిఖిల్ 

నిఖిల్(Nikhil)ప్రస్తుతం 'స్వయంభు' అనే చారిత్రాత్మక నేపథ్యంతో కూడుకున్న చిత్రంతో పాటు 'ది ఇండియా హౌస్'(The India House)అనే మరో విభిన్న జోనర్ కి చెందిన మూవీ చేస్తున్నాడు. ఇండియాకి స్వాతంత్రం రాకముందు లండన్ లోని ఇండియా హౌస్ నేపధ్యంలో జరిగే లవ్ అండ్ విప్లవం నేపధ్యంలో ఈ చిత్ర కథ తెరకెక్కబోతుంది. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ దగ్గరలోని శంషాబాద్ లో జరుగుతుండగా,సముద్రం లో చిత్రీకరించే సీన్స్ కోసం భారీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసారు. కానీ ఆ ట్యాంకర్ పగిలిపోవడంతో అసిస్టెంట్ కెమెరామెన్ కి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ విషయంపై నిఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు సముద్రం సీన్స్ ని తెరకెక్కించడానికి ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ పగిలిపడంతో సెట్ లోకి నీళ్లు వరదలా పారాయి. ప్రేక్షకులకి గొప్ప సినిమా టిక్ అనుభూతిని కలిగించడం కోసం కొన్ని సార్లు రిస్కులు తప్పవు. ఆ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సిబ్బంది తీసుకున్న జాగ్రత్తల కారణంగా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. కానీ ఖరీదైన పరికరాలకి కోల్పోయాం. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపాడు.

ఇక ఈ చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వి, మెగా పిక్చర్స్ అనే సంస్థని నెలకొల్పి, మరో నిర్మాత అభిషేక్ అగర్వాల్ తో కలిసి నిర్మిస్తున్నాడు. నిఖిల్ సరసన సయి మంజ్రేకర్(Saiee Manjrekar)హీరోయిన్ గా చేస్తుండగా బాలీవుడ్ అగ్ర నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. రామ్ వంశీ కృష్ణ (Ram Vamsikrishna)దర్శకుడు.