English | Telugu

రానా, ఇలియానా నేను-నా రాక్షసి ఏప్రెల్ 29 న

రానా, ఇలియానా నేను-నా రాక్షసి ఏప్రెల్ 29 న విడుదల కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై, యువ హీరో రానా హీరోగా, నలక నడుము అందాల గోవాభామ ఇలియానా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు బుజ్జి (శ్రీనివాస్) నిర్మిస్తున్న చిత్రం "నేను- నా రాక్షసి". ఈ చిత్రం దాదాపు చిత్రీకరణంతా పూర్తయ్యే స్థితిలో ఉంది. ఈ చిత్రాన్ని రానున్న వేసవి శలవుల్లో, ఏప్రెల్ 29 వ తేదీన విడుదల చేయటానికి ఈ చిత్ర నిర్మాత నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) సన్నాహాలు చేస్తున్నట్లు ఫిలిం నగర్ అంటున్నాయి.

అప్పటికి యన్ టి ఆర్ "శక్తి", ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్", పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రాలు విడుదలవుతాయి. అల్లు అర్జున్ "బద్రీనాథ్" మే 19 వ తేదీన కనక "నేను-నా రాక్షసి" చిత్రానికి పెద్ద చిత్రాలేవీ అడ్డంకిగా మారవు. కనుక ఈ రానా, ఇలియానా "నేను-నా రాక్షసి" చిత్రాన్నిఏప్రెల్ 29 వ తేదీన విడుదల చేయటానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని సినీ జనాలనుకుంటున్నారు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.