English | Telugu

నందమూరి,అక్కినేని మల్టీస్టారర్ ని అడ్డుకుంటున్న నటి

చెన్నైలోని ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్‌లో సూర్యకాంతం గారి శత జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సూర్యకాంతం గారి నటన కి ఉన్న శక్తిని తనదయిన శైలీలో చెప్పి ఆహుతులని ఆహ్లాదపరిచారు . ఇక ఇదే ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్రముఖ సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ గారు గుండమ్మ కథ సినిమా ఎందుకు నందమూరి అక్కినేని కి చెందిన రెండు తరాల హీరోలతో ముందుకు వెళ్లలేదో చెప్పి నందమూరి, అక్కినేని అభిమానులకి షాక్ ని ఇచ్చాడు.

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హీరోలుగా సూర్యకాంతం ప్రధాన పాత్ర పోషించిన చిత్రం గుండమ్మ కథ. ఈ సినిమాలో గుండమ్మ గా సూర్యకాంతం నటించారు అనే కంటే జీవించారని చెప్పవచ్చు. ఈ గుండమ్మ కథ మూవీని ఆ తర్వాత రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వారసులైన బాలకృష్ణ, నాగార్జునలతో అదే టైటిల్ తో సినిమాని తెరకెక్కించాలని అనుకున్నారు. బాలకృష్ణ ,నాగార్జున లు ఇద్దరు కూడా మేము రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.కానీ సూర్యకాంతం గారిలా అత్త పాత్ర నటించే ఆర్టిస్ట్ ఎంత వెతికినా దొరకకపోవడంతో బాలయ్య, నాగ్ కాంబో తెరకెక్కలేదు. ఆ తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ ,నాగ చైతన్య ల తో గుండమ్మ కథ మూవీ ని తెరకెక్కించాలని చాల ప్రయత్నాలు జరిగాయి. అప్పుడు కూడా అత్త పాత్రకి సూర్య కాంతం గారి లాంటి ఆర్టిస్ట్ దొరక్క ఆ సినిమా కూడా చిత్రీకరణకి నోచుకోలేదు.

ఈ విషయాలన్నీ స్వయంగా కాట్రగడ్డ ప్రసాద్ గారు చెప్పారు.
కాట్రగడ్డ ప్రసాద్ గారు మంచి కథా బలమున్న ఎన్నో చిత్రాలని నిర్మించారు. జైలు నుంచి బయటకి వచ్చిన సుమన్ తో కాట్రగడ్డ ప్రసాద్ గారు కంటిన్యూగా చిత్రాలు నిర్మించి సుమన్ తెలుగు చిత్ర పరిశ్రమలో శాశ్వత స్థానాన్ని పొందేలా చేసింది ప్రసాద్ గారే. ఇప్పుడు ప్రసాద్ గారి వ్యాఖ్యలు విన్న నందమూరి ,అక్కినేని అభిమానులు సూర్యకాంతం గారి లాంటి నటీమణి కనుక ఉండి ఉంటే నందమూరి, అక్కినేని రెండో తరం మూడో తరం వారసుల కాంబినేషన్ లో సినిమా చూసే అదృష్టం దొరికుండేది అని అనుకుంటున్నారు. అలాగే సూర్యకాంతం గారి లాంటి నటీమణి లేక పోవడం వల్లనే రెండు సార్లు గుండమ్మ కథ మూవీ వాయిదా పడిందంటే సూర్యకాంతం గారు ఎంత గొప్ప నటీమనో అని కూడా అనుకుంటున్నారు.