English | Telugu

Devara : ఇది ప్లానింగ్ అంటే.. 'దేవర'ను చూసి అందరూ నేర్చుకోవాలి!

Devara : ఇది ప్లానింగ్ అంటే.. 'దేవర'ను చూసి అందరూ నేర్చుకోవాలి!

స్టార్ హీరోల సినిమాలకు షూటింగ్ ఆలస్యమవ్వడం, విడుదల వాయిదా పడటం వంటివి జరగడం సహజం. ఇక లీక్ ల బెడద ఉండనే ఉంది. ప్రస్తుతం దాదాపు అందరి స్టార్ హీరోల సినిమాలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. 'గుంటూరు కారం' షూటింగ్ కి పలుసార్లు బ్రేక్ పడింది. ఈమధ్య కాస్త షూటింగ్ సాఫీగా సాగుతుందనుకుంటే.. ఇటీవల సాంగ్ లీక్ అయింది. 'గేమ్ ఛేంజర్' ది కూడా ఇంచుమించు అదే పరిస్థితి. షూటింగ్ జెట్ స్పీడ్ లో మొదలైంది కానీ, ఆ తర్వాత వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. దానికితోడు షూటింగ్ టైంలో ఎన్నో పిక్స్ లీక్ అయ్యాయి. ఇక ఇటీవల సాంగ్ కూడా లీక్ అయింది. 'సలార్', 'ప్రాజెక్ట్ k' సినిమాలు కూడా.. షూటింగ్ ఆలస్యం, సీజీ వర్క్, పిక్స్ లీక్ వంటి సమస్యలు ఎదుర్కొన్నాయి. దాదాపు అన్ని బడా సినిమాల పరిస్థితి ఇలాగే ఉంది.. ఒక్క 'దేవర' తప్ప.

'ఆర్ఆర్ఆర్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకుంది. దీంతో ఎన్టీఆర్ తన ప్రైమ్ టైంని వేస్ట్ చేసుకుంటున్నాడంటూ అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే కొద్ది నెలల్లోనే దానికి పూర్తి భిన్నంగా పరిస్థితి మారిపోయింది. దేవర టీం ప్లానింగ్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. మిగతా ప్రొడక్షన్ హౌస్ లు దేవరను చూసి నేర్చుకోవాలని అభిప్రాయపడుతున్నారు.

దేవర షూటింగ్ ఆలస్యంగా మొదలైనప్పటికీ, పక్కా ప్లానింగ్ తో శరవేగంగా సాగుతోంది. వీఎఫ్ఎక్స్ కి ఎక్కువ సమయం కేటాయించాలన్న ఉద్దేశంతో ముందుగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత టాకీ పార్ట్ మొదలుపెట్టారు. ఇప్పటిదాకా టీం విడుదల చేసిన పోస్టర్స్ తప్ప, సెట్స్ నుంచి పిక్స్ లీక్ కాలేదు. ఆఖరికి ఇటీవల గోవాలో షూటింగ్ జరగగా.. ఔట్ డోర్ షూట్ అయినప్పటికీ ఎటువంటి లీక్స్ లేవు. షెడ్యూల్స్ అనుకున్నవి అనుకున్నట్టుగా స్టార్ట్ చేసి పూర్తి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఉత్సాహపరుస్తున్నారు. అలాగే లీక్స్ బెడద లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో దేవర టీం ప్లానింగ్ ని చూసి, బడా సినిమాలు నిర్మిస్తున్న మిగతా ప్రొడక్షన్ హౌస్ లు నేర్చుకోవాలంటూ ఇతర హీరోల అభిమానులు సోషల్ మీడియాలో పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.