English | Telugu
శ్రీను వైట్ల దర్శకత్వంలో యన్ టి ఆర్
Updated : Mar 19, 2011
శ్రీను వైట్ల దర్శకత్వంలో యన్ టి ఆర్ హీరోగా గణేష్ నిర్మించే సినిమాకి దర్శకుడు శ్రీనువైట్ల చెప్పిన కథ హీరో యన్ టి ఆర్ కి బాగా నచ్చిందని తెలిసింది. యన్ టి ఆర్ హీరోగా గణేష్ నిర్మించబోతున్న ఈ ఫిలిం ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటోంది. శ్రీను వైట్ల యంగ్ టైగర్ యన్ టి ఆర్ ని, సారీ ప్రస్తుతం ఎ-1 స్టార్ యన్ టి ఆర్ ని ఎంత విభిన్నంగా చూపించబోతున్నాడో అని సినీ పరిశ్రమలో ఉత్సుకత నెలకొంది. మామూలుగా శ్రీనువైట్ల సినిమాల్లో కామెడీకి చాలా ప్రాథాన్యత ఉంటుంది.
యన్ టి ఆర్ కూడా కామెడీని బాగా పండించగలడని "అదుర్స్" మూవీలో నిరూపించబడింది. మరి శ్రీను వైట్ల దర్శకత్వంలో యన్ టి ఆర్ హీరోగా గణేష్ నిర్మించబోయే సినిమాలో శ్రీనువైట్ల, యన్ టి ఆర్ ల కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.