English | Telugu

థియేటర్లలో యన్ టి ఆర్ మ్యారేజ్

థియేటర్లలో యన్ టి ఆర్ మ్యారేజ్ లైవ్ ఇవ్వనున్నారని తెలిసింది. వివరాల్లోకి వెళితే యంగ్ టైగర్ యన్ టి ఆర్ మ్యారేజ్ నార్నే శ్రీనివాసరావు ఏకైక కుమార్తె లక్ష్మీ ప్రణీతతో మే నెల అయిదో తేదీన జరుగ నుంది. ఈ యన్ టి ఆర్ మ్యారేజ్ ని నార్నేశ్రీనివాస రావు తమ సొంతఛానల్ "స్టుడియో N" లో లైవ్ టెలికాస్ట్ చేయాలని సంకల్పించగా, అందుకు యన్ టి ఆర్ అభ్యంతరం తెలిపినట్లు ఫిలిం నగర్ వాసుల ద్వారా సమాచారం.

"స్టుడియో N" న్యూస్ ఛానల్ అనీ, అందులో కాకుండా ఏదైనా ఎంటర్ టైన్ మెంట్ ఛానల్లో అయితే ప్రజలందరికీ అందుబాటులో ఉండి, తన పెళ్ళి అందరూ చూసేందుకు వీలుగా ఉంటుందనే అభిప్రాయంతో యన్ టి ఆర్ ఉన్నట్లు సమాచారం. అది కూడా అల్లు అర్జున్ మ్యారేజ్ ని లైవ్ టెలికాస్ట్ చేసిన "మా" ఛానల్లో అయితే ఇంకా బాగుంటుందని యన్ టి ఆర్ అన్నాడని తెలిసింది. ఇదిలా ఉండగా యన్ టి ఆర్ మ్యారేజ్ ని థియేటర్లలో లైవ్ టెలికాస్ట్ చేయటానికి ప్రముఖ నిర్మాత చలసాని అశ్వనీదత్ సన్నాహాలు చేస్తున్నారట.

ఇలా థియేటర్లలో ఒక హీరో మ్యారేజ్ ని లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రదర్శించటం ఇదే మొదలు. యన్ టి ఆర్ మ్యారేజ్ ఇలా థియేటర్లలో లైవ్ టెలికాస్ట్ చేయటాన్ని టిక్కెట్లు పెట్టి చూపిస్తారో లేక అభిమానుల కోసం ఉచితంగా చూపించనున్నారో ఇంకా తెలియదు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.