English | Telugu
నర్తనశాల రీమేక్ తప్పక చేస్తా - నందమూరి బాలకృష్ణ
Updated : Mar 19, 2011
కాని నటి సౌందర్య అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోవటం, అదే సమయంలో నందమూరి బాలకృష్ణకు కాలికి దెబ్బతగలటం వంటి అపశకునాలు ఎదురవటంతో ఈ సినిమాని నందమూరి బాలకృష్ణ ఆపాల్సివచ్చింది. కానీ ఇటీవల ఒక ఇంజనీరింగ్ కాలేజీ వార్షికోత్సవానికి హాజరైన నందమూరి బాలకృష్ణ " నేను ఈ నర్తనశాల చిత్రాన్ని నా దర్శకత్వంలో తప్పక తీస్తాను. ఈ నర్తనశాల చిత్రం నన్ను ఎంత ఉత్తేజితుణ్ణి చేసిందంటే ఆ చిత్రం స్క్రిప్ట్ లోని కీచకుడి డైలాగ్ ఇంకా నాకు గుర్తుంది" అంటూ ఆ కీచకుడి అతి పెద్ద డైలాగ్ ని చెప్పి అక్కడి ప్రేక్షకులను అలరించారు.