English | Telugu

ప్రభాస్ ఆదిపురుష్  దెబ్బకి దేశం వదిలి పారిపోయా 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడుగా రామాయణాన్ని ఇతివృత్తంగా చేసుకొని తెరకెక్కిన సినిమా ఆదిపురుష్.ప్రభాస్ ఫాన్స్ తో పాటు సినీ ప్రేక్షకుల్లో అలాగే రామ భక్తుల్లో ఆదిపురుష్ సినిమా మీద ఎన్నో అంచనాలని పెట్టుకున్న్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ గా ఆది పురుష్ నిలిచింది. అంతే కాకుండా పవిత్ర రామాయణాన్ని కావాలని అవమానించారనే విమర్శలని సైతం ఎదుర్కొంది . తాజాగా ఆదిపురుష్ సినిమాకి మాటలని అందించిన రచయిత ఆ సినిమా వల్ల తను కోల్పోయింది చెప్పి మరోసారి ఆదిపురుష్ సినిమా వార్తల్లోకెక్కేలా చేసాడు.

జూన్ 16 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆదిపురుష్ సినిమాకి మాటలు అందించింది మనోజ్ ముంత షీర్. తాజాగా ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ముంత షీర్ మాట్లాడుతూ నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద పొరపాటు ఆదిపురుష్ సినిమాకి పని చెయ్యడమే. ఆ సినిమా తర్వాత ఎన్నో అవమానాలని ఎదుర్కొన్నాను.. నన్నందరూ చెడ్డవాడిగా చూసారు ఒక దశలో నన్ను చంపడానికి చూస్తే దేశం కూడా వదిలి వెళ్ళిపోయాను అని చెప్పుకొచ్చాడు. కాకపోతే బయట వాళ్ళు మనల్ని ఎంత చెడ్డవాడిగా చూసినా మన కుటుంబం దృష్టిలో మనమే హీరో అని కూడా చెప్పుకొచ్చాడు.

ఆదిపురుష్ సినిమా విడుదల తర్వాత ముంత షీర్ మీద దారుణమైన ట్రోలింగ్ జరిగింది. అలాగే రాముడు మాటతీరు, ప్రవర్తన, వస్త్ర ధారణ అలా ఉంటుందా అని సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ముంత షీర్ మీద నిప్పులు చెరిగారు. అలాగే సీత, రావణాసురుడుతో పాటు మిగతా క్యారెక్టర్ల విషయంలో కూడా ఎంతో వ్యతిరేకత వచ్చింది. అంతే కాకుండా మూవీ లోని ఒక డైలాగ్ విషయంలో తీవ్ర వ్యతిరేకత వస్తే ముంత షీర్ ప్రేక్షకులకి క్షమాపణలు కూడా చెప్పాడు. కృతి సనన్ సీత పాత్రల్లో నటించగా ,సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా నటించాడు