English | Telugu

అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ.. గ్రేట్ కాంబో రిపీట్!

టాలీవుడ్ లో ఉన్న సక్సెస్ ఫుల్ దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఇటీవల నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించిన 'భగవంత్ కేసరి'తో ఆయన మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కామెడీ ఎంటర్టైనర్స్ తీయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న రావిపూడి.. తన గత చిత్రాలకు భిన్నంగా 'భగవంత్ కేసరి'లో అద్భుతమైన ఎమోషన్స్ పండించి సాలిడ్ హిట్ కొట్టారు. దీంతో అనిల్ రావిపూడి తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నారు? ఎలాంటి సినిమా చేయబోతున్నారు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

రావిపూడి తన నెక్స్ట్ మూవీని మాస్ మహారాజా రవితేజతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరి కలయికలో 'రాజా ది గ్రేట్' అనే విజయవంతమైన చిత్రం వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా.. 2017 అక్టోబర్ 18న విడుదలై రవితేజ కెరీర్ లో టాప్ గ్రాసర్ గా నిలిచింది.

కొందరు చూపు లేకపోయినా మెంటల్ గా, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అలాంటి వ్యక్తి హీరో అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో పుట్టిన కథే రాజా ది గ్రేట్. బ్లైండ్ పర్సన్ క్యారెక్టర్ ని తీసుకొని కూడా ఎవరినీ నొప్పించకుండా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ని అందించవచ్చని ఈ సినిమాతో రావిపూడి నిరూపించారు. రవితేజ కెరీర్ లో రిపీటెడ్ గా చూడదగ్గ కామెడీ ఎంటర్టైనర్స్ లో ఒకటిగా 'రాజా ది గ్రేట్' పేరు తెచ్చుకుంది. అలాంటి కాంబినేషన్ లో ఇప్పుడు మరో రాబోతున్నట్లు సమాచారం. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అని వినికిడి.

రవితేజ-రావిపూడి కాంబోలో రూపొందనున్న రెండో సినిమాని కూడా దిల్ రాజే నిర్మించనున్నారట. ఇప్పటిదాకా అనిల్ డైరెక్ట్ చేసిన మెజారిటీ సినిమాలకు దిల్ రాజే నిర్మాత కావడం విశేషం.