English | Telugu

మనోజ్, శ్రియ మూవీ ప్రారంభం

మనోజ్, శ్రియ మూవీ ప్రారంభమయ్యింది. వివరాల్లోకి వెళితే, మంచు మనోజ్ కుమార్ హీరోగా, శ్రియ హీరోయిన్ గా, అని (అనిల్ కృష్ణ) దర్శకత్వంలో, డి.యస్.రావ్ నిర్మిస్తున్న "ప్రొడక్షన్ నంబర్ -3" చిత్రం హైదరాబాద్ రామానాయుడు స్టుడియోలో, టివి 5 యమ్ డి రవీంద్రనాథ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు ముహూర్తం షాట్ కు గౌరవదర్శకత్వం వహించగా, మార్చ్ 21 వ తేదీన ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది.

ఈ చిత్రాన్ని సింగిల్‍ స్కెడ్యూల్లో పూర్తిచేస్తారు. "అడవిలోఅన్న"లో బాలనటుడిగా ఉన్న మనోజ్ హీరో అయిన తర్వాత పరుచూరి బ్రదర్స్ వ్రాస్తున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్నందిస్తూండగా, పాటలన్నీ రామజోగయ్య శాస్త్రి వ్రాస్తున్నారు. ఈ చిత్రం ఆడియోని చాలా విభిన్నంగా విడుదల చేస్తారు.ముందుగా ఈ చిత్రంలోని రెండు పాటలకు యువన్ శంకర్ రాజా అద్భుతమైన ట్యూన్లు ఇచ్వ్చారనీ, ఒక పాటను త్వరలో విడుదల చేస్తామని హీరో మనోజ్ కుమార్ అన్నారు.

ఆయన, ఆవిడ మధ్యలో ఒక గాలి కుర్రాడు ఇదీ కథనీ, కానీ ట్రీట్ మెంట్ చాలా కొత్తగా ఉంటుందనీ, దర్శకుడు అనీల్ కృష్నకు మాచేతుల మీదుగా 100 డేస్ షీల్డ్ ఈ సినిమా ద్వారా మా చేతుల మీదుగా అందించాలని మా కోరికని పరుచూరి బ్రదర్స్ తెలిపారు. ఈ సమావేశంలో హీరో మంచు మనోజ్ కుమార్, హీరోయిన్ శ్రియ, పరుచూరి బ్రదర్స్, దర్శకుడు అని (అనీల్ కృష్ణ), నిర్మాత డి.యస్.రావు తదితరులు హాజరయ్యారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...