English | Telugu

మహేష్ మణిరత్నం మూవీలో రీచా గంగోపాథ్యాయ

మహేష్ బాబు హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో రాబోయే తెలుగు, తమిళ, హిందీ మూవీలో రీచా గంగోపాథ్యాయ హీరోయిన్ గా ఎన్నికయ్యిందని ఫిలిం నగర్ వర్గాల కథనం. "పొన్నియన్ సెల్వన్" అనే తమిళ చారిత్రక నవలకు వెండి తెర రూపం ఇస్తూ మణిరత్నం దర్శకత్వం వహిస్తుండగా నిర్మిస్తున్న చిత్రంలో "లీడర్" ఫేం రీచా గంగోపాథ్యాయ హీరోయిన్ గా మహేష్ బాబు సరసన బుక్కయ్యిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.


ఈ విషయం గురించి రిచా గంగోపాథ్యాయను అడగ్గా తాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఒక చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించాననీ ఇది తనకు సువర్ణావకాశమని, ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో మీడియాకు తెలియజేస్తాననీ రీచా గంగోపాథ్యాయ మీడియాతో అంది. గతంలో ఈ పాత్ర కోసం అనుష్కను అనుకున్నారట. కానీ ఆమెకు డేట్లు కుదరక ఈ చిత్రం వదులుకోవలసి వచ్చింది. ఈ చిత్రం తమిళ వెర్షన్ లో విజయ్, ఆర్య నటిస్తూండగా, తెలుగులో మహేష్ బాబు, రిచా గంగోపాథ్యాయ నటిస్తున్నారు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.