English | Telugu
జానీమాస్టర్ రీ ఎంట్రీ సాంగ్ అదిరింది
Updated : Apr 2, 2025
వీరసింహారెడ్డి ఫేమ్ గోపిచంద్ మలినేని(Gopichand Malineni)దర్శకత్వంలో బాలీవుడ్ బిగ్ హీరో సన్నీడియోల్(Sunny Deol)చేస్తున్న'జాట్'(Jaat)మూవీ ఏప్రిల్ 10 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఒక రేంజ్ లో ఉండటంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ 'జాట్' రాక కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ మూవీ నుంచి రీసెంట్ గా 'టచ్ కియా' అనే ప్రత్యేక గీతం రిలీజయ్యింది.వాల్తేరు వీరయ్య, డాకు మహారాజ్ ఫేమ్ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela)పై చిత్రీకరణ జరగగా స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master)చాలా గ్యాప్ తర్వాత నృత్యాలని సమకూర్చాడు.సాంగ్ ప్రోమో వీడియోని కూడా మేకర్స్ రిలీజ్ చేసారు.ఊర్వశి రౌతేలా వేస్తున్న స్టెప్ లకి థియేటర్స్ లో విజిల్స్ మోత ఖాయమనే విషయం అర్ధమవుతుంది.జానీ మాస్టర్ సరికొత్త స్టెప్ లని డిజైన్ చెయ్యడంతో జాట్ తో జానీ మాస్టర్ కమ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు.ఇక థమన్ అందించిన మ్యూజిక్ కూడా చాలా హుషారుగా సాగింది.కుమార్ సాహిత్యాన్ని అందించగా మధుబంటి భాగీ,షాహిద్ మాల్యా ఆలపించారు.
తెలుగులో ఎన్నోసూపర్ హిట్ చిత్రాలని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సన్నీ డియోల్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో 'జాట్' ని నిర్మించగా రెజీనా,జగపతిబాబు,రణదీప్ హుడా,వినీత్ కుమార్,రమ్య కృష్ణ,సయామీ ఖేర్,పృథి తదితరులు కీలక పాత్రలు పోషించారు.