English | Telugu
నితిన్ 'ఇష్క్' లో నిత్య మీనన్
Updated : Mar 19, 2011
కేరళ నుంచి వచ్చిన నిత్య మీనన్ "అలా మొదలైంది" చిత్రంతో తెలుగు చలన చిత్ర రంగానికి హీరోయిన్ గా పరిచయమైంది. తన తొలి చిత్రంతోనే నిత్య మీనన్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని పలువురు సినీ ప్రముఖులను ఆకట్టుకుంది. కానీ నిత్య మీనన్ కాస్త పొట్టి అవటం వల్ల పెద్ద హీరోలెవరూ నిత్య మీనన్ కు తమ సినిమాల్లో అవకాశం ఇవ్వటానికి జంకుతున్నారు.
అందుకే నితిన్ హీరోగా నటించే "ఇష్క్" చిత్రంలో నిత్య మీనన్ కు అవకాశం తేలికగా దక్కింది. ఈ నితిన్ 'ఇష్క్' లో నిత్య మీనన్ హీరోయిన్ గా న్టిస్తున్న చిత్రానికి పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూండగా, శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నితిన్ 'ఇష్క్' లో నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం నిర్వహిస్తున్నారు.