English | Telugu
ఎంజీఆర్‌ని ఫాలో అవుతున్న విజయ్!
Updated : Jul 4, 2023
తమిళ హీరో విజయ్ ఇప్పుడు మక్కల్ తిలగం ఎంజీఆర్‌ని ఫాలో అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి న్యూస్ గట్టిగా వినిపిస్తోంది. త్వరలోనే అది జరుగుతుందనే మాటలూ ఉన్నాయి. ఇది కరెక్ట్ టైమా? కాదా? అని నిన్నటిదాకా ఆలోచించినవారు కూడా ఆలస్యం అమృతం విషం అంటున్నారు. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తే, యాక్టింగ్ కెరీర్‌కి కామా పడుతుందని కూడా అంటున్నారు.
తమిళనాడులో వినిపిస్తున్న వార్తల ప్రకారం, యాక్టర్ విజయ్ త్వరలోనే యాక్టింగ్ కెరీర్‌కి బ్రేక్ ఇస్తారు. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్న దళపతి 68 షూటింగ్ పూర్తి కాగానే ఆయన పాలిటిక్స్ మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తారు. 2026 ఎన్నికల్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తారు విజయ్. ఇటీవల పది, పన్నెండో తరగతి మంచి మార్కులు తెచ్చుకున్న పాఠశాల విద్యార్థులను ప్రత్యేకంగా పిలిచి గౌరవించారు విజయ్.
అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీని, రజనీ కాంత్ ఎంట్రీ, కమల్ హాసన్ ఎంట్రీతోనూ పోల్చి చూస్తున్నారు జనాలు. అయితే ఇప్పటికి ఈ విషయం గురించి విజయ్ తండ్రి మాత్రమే మాట్లాడుతున్నారు. విజయ్ మాత్రం ఎక్కడా అఫిషియల్ గా నోరు విప్పలేదు. ఒకవేళ దళపతి 68వ సినిమానే ఆయన కెరీర్‌లో ఆఖరి సినిమా అయితే, ఆ సినిమాకు అభిమానులు అందించే కలెక్షన్లు ఎవరి ఊహలకు అందనివీ, ఆ రికార్డులను మిగిలిన హీరోలు అంత తేలిగ్గా బద్ధలు కొట్టలేరు అనే మాటలు వినిపిస్తున్నాయి. దళపతి 68వ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆఖరు నుంచి మొదలవుతుంది. లియో అక్టోబర్ 19న విడుదలవుతుంది. కొన్నాళ్ల గ్యాప్‌తో 68నిమొదలుపెట్టేస్తారు విజయ్. వెంకట్ ప్రభు డైరక్ట్ చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తారు.