English | Telugu
ఇడ్లీ కొట్టు విషయంలో అగ్ర నిర్మాతల పోటీ!.. తెలుగు ప్రేక్షకులకి డబుల్ ధమాకా
Updated : Jul 15, 2025
తమిళ స్టార్ హీరో 'ధనుష్'(Dhanush)రీసెంట్ గా 'నాగార్జున'(Nagarjuna)తో కలిసి 'కుబేర'(Kuberaa)తో మరోసారి తెలుగులో మంచి విజయాన్ని అందుకున్నాడు. దీంతో 2023 లో వచ్చిన 'సార్' మూవీ తర్వాత ధనుష్ స్ట్రెయిట్ తెలుగులో కుబేర తో రెండో విజయాన్ని అందుకున్నట్లయ్యింది. ప్రస్తుతం తమిళంలో 'ఇడ్లీ కడై'(Idli Kadai)అనే విభిన్న కథతో కూడిన చిత్రం చేస్తున్నాడు. డాన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా ధనుష్ నే దర్శకత్వం వహిస్తున్నాడు. రాయన్ తర్వాత ధనుష్ దర్శకత్వంలో వస్తున్న రెండో మూవీ ఇడ్లీ కడై కావడంతో, పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 'రఘువరన్ బిటెక్ నుంచి, ధనుష్ ప్రతి చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతు వస్తున్న విషయం తెలిసిందే.
దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా 'ఇడ్లీ కడై' కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇడ్లీ కడై' అంటే తెలుగులో 'ఇడ్లి కొట్టు' అని అర్ధం. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తెలుగు హక్కుల కోసం అగ్ర నిర్మాణ సంస్థలు సితార ఎంటర్ టైన్ మెంట్స్,'(Sithara Entertainments)'శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి'(Sri Venkateswara Productions LLP)సంస్థలు పోటీ పడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆసక్తి కరమైన విషయం ఏంటంటే సితార సంస్థ సార్ ని నిర్మించగా, శ్రీ వెంకటేశ్వర ఎల్ ఎల్ పి కుబేర ని నిర్మించింది. దీంతో 'ఇడ్లీ కడై' తెలుగు హక్కులు ఆ ఇద్దరిలో ఎవరకి దక్కుతాయనే ఆసక్తి ఏర్పడింది. మరికొన్ని సంస్థలు కూడా ఈ విషయంలో పోటీకి వస్తునట్టుగా సమాచారం.
'ఇడ్లీ కడై' కథ విషయానికి వస్తే ఇడ్లి అమ్ముకుని జీవినాన్ని కొనసాగించే వ్యక్తి క్యారక్టర్ లో ధనుష్ కనిపించనున్నాడు. ఇడ్లి వ్యాపారి తన జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, సవాళ్లు మరియు విజయాల నేపధ్యాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పనున్నారు. ధనుష్ సరసన 'నిత్య మీనన్'(Nithya menon)జత కడుతుంది. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబోలో తిరు, తను నీ నాన వంటి హిట్ చిత్రాలు వచ్చి ఉండటంతో 'ఇడ్లీ కడై పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే, ప్రకాష్ రాజ్, అరుణ్ విజయ్, సముద్ర ఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఏప్రిల్ 10 న రిలీజ్ కావాల్సిన 'ఇడ్లీ కడై' అక్టోబర్ 1 కి వాయిదా పడింది.