English | Telugu

యుఎస్ లో హరిహర వీరమల్లు రన్ టైం!.. ఇది వాళ్ళ పనే 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పోరాటయోధుడుగా నటించిన హిస్టారికల్ మూవీ 'హరిహర వీరమల్లు' పార్ట్ 1(Hari Hara Veera Mallu)ఈ నెల 24 న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ తో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో వీరమల్లుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ ని సైతం ట్రైలర్ రాబట్టింది. మెగా సూర్య పతాకంపై ఏఎం రత్నంతో కలిసి ఆయన సోదరుడు దయాకర్ అత్యంత భారీ వ్యయంతో వీరమల్లుని నిర్మించగా జ్యోతికృష్ణ(Jyothikrishna),క్రిష్ జాగర్లమూడి(Krish)సంయుక్తంగా దర్శకత్వం వహించడం జరిగింది.

వీరమల్లుకి సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఓవర్ సీస్(Overseas)లోని కొన్ని ఏరియాల్లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఒక టికెట్ బుకింగ్ ఫ్లాట్ ఫార్మ్ సంస్థ తమ సైట్ లో వీరమల్లు రన్ టైంని రెండు గంటల నలభై నిమిషాలుగా పేర్కొంది. దీంతో వీరమల్లు రన్ టైం న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎక్కడా స్పందించలేదు. కొన్ని రోజులు అయితే గాని రన్ టైం విషయంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉండదని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

వీరమల్లులో పవన్ కి జోడిగా పంచమి అనే క్యారక్టర్ లో 'నిధిఅగర్వాల్'(Nidhhi Agerwal)చేస్తుంది. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో వీరమల్లు గురించి మాట్లాడుతు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి వీరమల్లు. మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది. అభిమానులకి ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుందని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ అగ్ర నటుడు బాబీ డియోల్(Bobby Deol) ఔరంగజేబుగా చేస్తుండగా నర్గిస్ ఫక్రి,నోరా ఫతేహి, అనసూయ, రఘుబాబు, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి(Keeravani)సంగీతాన్ని అందిస్తున్నాడు.