English | Telugu

ఎన్టీఆర్ ముక్కుపై  గరికపాటి నరసింహారావు కీలక వ్యాఖ్యలు  

తెలుగు వారి కీర్తిని విశ్వ వ్యాప్తం చేసి విశ్వంలో కూడా తెలుగు వారి సత్తా చాటడానికి దివి నుంచి భువికేగిన మహా మనిషి నందమూరి తారకరామారావు(ntr)రీసెంట్ గా గుంటూరులో ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ని స్థాపించి యాభై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు(Garikapati Narasimha Rao)ఎన్టీఆర్ గురించి చెప్పిన విషయాలు అభిమానుల్లో అమితానందాన్ని ఇస్తున్నాయి.


గరికపాటి గారు మాట్లాడుతూ నేను ఎన్టీఆర్ కి వీరాభిమానిని. ఇప్పుడు పై లోకంలో కూడా ఎన్టీఆర్ తన పరిపాలనని కొనసాగిస్తున్నారు. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు.ప్రతి తెలుగు వారి ఇంట్లో ఖచ్చితంగా శ్రీకృష్ణ దేవరాయలు పాత్రలో చేసిన ఎన్టీఆర్ ఫోటోని ఉంచండి. మీ పిల్లలకి ఆ ఫోటో చూపించి శ్రీకృష్ణ దేవరాయలు అని చెప్పండి.అలాగే ఎన్టీఆర్ గారు కూడా మన తెలుగు గొప్పతనాన్ని చాటి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటున్నారు. 1970 లో కొంత మంది హిందీ నిర్మాతలు ఎన్టీఆర్ దగ్గరకి వచ్చి కోటి రూపాయిలు ఇస్తామని రాముడు కృష్ణుడు వేషం వేయమని అడిగారు. కానీ ఎన్టీఆర్ నో చెప్పారు. పది లక్షలు ఇవ్వండి తెలుగులోనే చేద్దామని అన్నారనే విషయాన్ని చాలా మంది ఆ రోజుల్లో చెప్పారు. తెలుగు అంటే ఎన్టీఆర్ గారికి అంత ఇష్టం అని చెప్పుకొచ్చారు.

అలాగే ఈ కార్యక్రమంలో దర్శకుడు వైవిఎస్ చౌదరి(yvs chowdary)పాల్గొనడంతో మరికొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు కూడా చేసారు. ఎన్టీఆర్ ప్రతి పుట్టిన రోజుకి చాలా ఏళ్ళ నుంచి పేపర్ లో ఎన్టీఆర్ తన బుగ్గ మీద చెయ్యి పెట్టుకొని ఉన్న ఫోటోని చౌదరి ప్రింట్ చేయిస్తాడు. ఆ ఫోటో రక్త సంబంధం సినిమాలో సావిత్రి గారు తన ఒడిలో ఉన్న బాబు కి ఆ ఫోటో చూపిస్తూ అన్నం తినిపిస్తుంది. ఆ సీన్ లో తప్ప ఆ ఫోటో ఎక్కడ ఉండదు. రాముడు, కృష్ణడు పాత్రల ఫోటో కంటే అందంగా ఉంటుంది. అలాంటి ఫోటోని చూపిస్తున్న చౌదరికి ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. అలాగే ఎన్టీఆర్ ముక్కు ఎవరకి రాదు.ఎందుకంటే అది కోటేరు ముక్కు .పదహారేళ్ళ అమ్మాయి అయినా ఆ ముక్కు చూసి ఎన్టీఆర్ వెనకే పడాల్సిందే .అసలు అలాంటి ముక్కు ఉన్న భర్త దొరికితే ఏ జన్మలోనో ముక్కోటి దేవతలకి మొక్కుకున్నట్టే అని కూడా చెప్పారు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ నుంచి ప్రతి ఒక్కరు క్రమశిక్షణ కూడా నేర్చుకోవాలని కూడా గరికపాటి గారు చెప్పారు.